CBN-Jagan : TDP సానుభూతి మీడియా అత్యుత్సాహం, ప‌క్క‌లో బ‌ల్లెంలా JSP !

ప్ర‌త్య‌ర్థుల‌ను ట్రాప్ చేయ‌డంలో వైసీపీ దిట్ట‌. గ‌త ఎన్నిక‌ల ముందు

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 12:00 PM IST

ప్ర‌త్య‌ర్థుల‌ను ట్రాప్ చేయ‌డంలో రాజ‌కీయంగా వైసీపీ దిట్ట‌. గ‌త ఎన్నిక‌ల ముందు ఎన్డీయేతో భాగ‌స్వామ్యాన్ని తెంపుకునే వ‌ర‌కు టీడీపీని(CBN-Jagan) వెంటాడింది. ఇప్పుడు టీడీపీ, ఆ పార్టీ సానుభూతి మీడియా(Media)ను పీక‌ల్లోతు ట్రాప్ లో దింపేసింది. ఆ విష‌యాన్ని ఆల‌స్యంగా గ్ర‌హించిన రాజ‌కీయ చాణ‌క్యుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. రాజ‌కీయ ప‌ద్మవ్యూహంలోకి వెళ్లిపోయిన పార్టీని కాపాడుకునే స్కెచ్ వేస్తున్నారు. అయితే, ఏ విధంగా రావాలి? అనేది ఇప్ప‌టికీ అంత‌బ‌ట్ట‌కుండా ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అత్యుత్సాహంతో టీడీపీ సానుభూతి మీడియా ప‌క్క‌లో బ‌ల్లెంలా జ‌న‌సేన పార్టీని త‌యారు చేసింది.

ఎన్డీయేతో భాగ‌స్వామ్యాన్ని తెంపుకునే వ‌ర‌కు టీడీపీని..(CBN-Jagan)

తెలుగుదేశం పార్టీతో జ‌న‌సేన (CBN-Jagan)క‌ల‌వ‌కుండా ఏపీ రాజ‌కీయాన్ని మ‌లుపు తిప్పాల‌ని `ప్రీ ఎల‌క్ష‌న్, పోస్ట్ ఎలక్ష‌న్ స్ట్రాట‌జీ` ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ర‌చించార‌ని ఆ పార్టీలోని టాక్‌. అందుకే, దగ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు హితేశ్ కూడా రాజ‌కీయాల‌కు దూరం అయ్యార‌ని తెలుస్తోంది. ఒకానొక స‌మ‌యంలో టీడీపీ అభ్య‌ర్థిగా ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హితేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రిగింది. అదే స‌మ‌యంతో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన అమృత‌మ‌హోత్స‌వంలో పాల్గొన్న చంద్ర‌బాబును మోడీ ప‌ల‌క‌రించిన సంఘ‌ట‌న చూశాం. సెక్యూరిటీ ప‌రంగా చంద్ర‌బాబుకు క‌మాండోల‌ను కేంద్రం పెంచింది. జీ20 కోసం స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను చంద్ర‌బాబు నుంచి కేంద్రం తీసుకుంది. ఇవన్నీ రాబోవు రోజుల్లో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూటమిగా ఎన్నిక‌ల‌కు వెళ‌తాయ‌ని అనుకోవ‌డానికి దృష్టాంతాలుగా చాలా మంది భావించారు.

మోడీ మాత్రం టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి స‌సేమిరా..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల పొత్తుల విష‌యంలో ఇచ్చిన సంకేతాల‌ను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా(CBN-Jagan) కేవ‌లం జ‌న‌సేన‌తో మాత్రమే వెళ్ల‌నున్నామ‌ని తెగేసి చెబుతున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా కొంత పాజిటివ్ గా ఉన్న‌ప్ప‌టికీ మోడీ మాత్రం టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి స‌సేమిరా అంటున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల వినికిడి. అందుకే, జ‌న‌సే, బీజేపీ పొత్తు మాత్ర‌మే ఉంటుంద‌ని ప‌దేప‌దే ఏపీ బీజేపీ చెబుతోంది. అందుకే, హితేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకున్నార‌ని ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రి కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉండే వాళ్ల టాక్‌.

Also Read : CBN-PM : మోడీ విజ‌న్ 2040కి చంద్ర‌బాబు స‌హ‌కారం! PMO నుంచి సంకేతాలు!

రాబోవు ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన‌-బీజేపీ, వైసీపీ, టీడీపీ మ‌ధ్య ముక్కోణ‌పు పోటీ (CBN-Jagan)జ‌ర‌గ‌నుంద‌ని తాజా ప‌రిణామాల ఆధారంగా తెలుస్తోంది. ఎందుకంటే, బీజేపీని వ‌దులుకుని జ‌న‌సేన బ‌య‌ట‌కు వ‌చ్చే ధైర్యం చేయ‌దు. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఆ పార్టీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి గుర్తింపు లేదు. కేవ‌లం రిజిస్ట్ర‌ర్ పార్టీగా ఉంది. ఒక వేళ బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే, ఆ పార్టీ సింబ‌ల్ గ్లాస్ గుర్తును కామ‌న్ గా పొంద‌డానికి అవ‌కాశం లేకుండా బీజేపీ చ‌క్రం తిప్పే అవ‌కాశం లేక‌పోలేదు. పైగా న‌రేంద్ర మోడీ విశాఖ కేంద్రంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పిలిపించుకుని ఇచ్చిన వార్నింగ్ జ‌న‌సేన మీద బాగా ప‌నిచేసింది. ఫ‌లితంగా బీజేపీ-జ‌న‌సేన క‌లిసి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

టీడీపీకి అధికారం క‌ష్ట‌మ‌నే భావాన్ని ప్ర‌జ‌ల్లో టీడీపీ సానుభూతి మీడియా (Media)

గ‌త ఎన్నిక‌ల కంటే జ‌న‌సేన గ్రాఫ్ పెరిగిందని బ‌లంగా తీసుకెళ్ల‌డంలో ప‌రోక్షంగా టీడీపీ, ఆ పార్టీ సానుభూతి మీడియా(Media) ప‌నిచేసింది. అప్పుడ‌ప్పుడు ఏపీకి వెళ్లే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వ్యూహాత్మ‌కంగా వైసీపీ హైప్ క్రియేట్ చేసేలా వ్య‌వ‌హ‌రించింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించ‌లేని టీడీపీ సానుభూతి మీడియా ప‌వ‌న్ ఆరు నెల‌ల‌కు ఒక‌సారి చేసే ప‌ర్య‌ట‌న‌ను అతిగా హైప్ చేయ‌డం జ‌రిగింది. ఫ‌లితంగా ఆ పార్టీ ఇప్పుడు సీఎం ప‌ద‌వి షేరింగ్ వ‌ర‌కు వెళ్లింది. ఆ పార్టీ లేకుండా ఎన్నికల‌కు వెళితే, టీడీపీకి అధికారం క‌ష్ట‌మ‌నే భావాన్ని ప్ర‌జ‌ల్లో టీడీపీ సానుభూతి మీడియా(Media)బ‌లంగా తీసుకెళ్లింది. బీజేపీ వ్యూహాత్మ‌కంగా జ‌నసేన పార్టీని ట్రాప్ చేస్తోంది. అంటే, ఎన్నిక‌ల‌కు ముందే (ప్రీ ఎల‌క్ష‌న్‌) తెలుగుదేశం పార్టీకి అధికారం రావ‌డం క‌ష్ట‌మ‌నే భావాన్ని తీసుకెళ్ల‌డానికి బీజేపీ స్కెచ్ వేసింది. ఒక వేళ అతి క‌ష్టం మీద అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌వ‌న్, వైసీపీ ద్వారా ఏదో ఒక ర‌కంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్ట‌డానికి పోస్ట్ ఎల‌క్ష‌న్ స్ట్రాట‌జీని కూడా బీజేపీ పెద్ద‌లు ఢిల్లీ కేంద్రంగా ర‌చించారట‌.

Also Read : CBN Giotag : జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌కు టెక్నాల‌జీతో చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చ‌తుర‌త‌

ఇలాంటి ప‌రిస్థితుల‌ను అవ‌గాహ‌న చేసుకున్న చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా జ‌న‌సేన ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాల‌ను మొద‌లు పెట్టార‌ని తెలుస్తోంది. అయితే, లోకేష్ మాత్రం యువ‌గ‌ళం సంద‌ర్భంగా వారాహి, యువ‌గ‌ళం అంటూ అన‌వ‌స‌ర ప‌బ్లిసిటీని జ‌న‌సేన‌కు ఇస్తున్నారు. బీజేపీ, వైసీపీ వేసిన ఎత్తుగ‌డలోని కుట్ర నుంచి ఇప్పుడే టీడీపీ బ‌య‌ట‌ప‌డే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ఆ రెండు పార్టీల‌ ప‌ద్మ‌వ్యూహంలోకి వెళ్లిపోయిన టీడీపీ సానుభూతి మీడియా(Media)కు ఇంకా అస‌లు కుట్ర పూర్తిగా తెలియ‌క‌పోవ‌డం విచిత్రం.