CBN : ఇప్పుడు సీఎంగా చంద్ర‌బాబు ఉంటే.!`గ‌న్న‌వ‌రం` ఎపిసోడ్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌!

గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్ మీద దాడిలాంటి సంఘ‌ట‌న చంద్ర‌బాబు(CBN) సీఎంగా ఉండ‌గా వైసీపీ ఆఫీస్ మీద జ‌రిగితే ఎలా ఉండేదో ఊహించుకోండి.

  • Written By:
  • Updated On - February 21, 2023 / 01:36 PM IST

గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్ మీద దాడిలాంటి సంఘ‌ట‌న చంద్ర‌బాబు(CBN) సీఎంగా ఉండ‌గా వైసీపీ ఆఫీస్ మీద జ‌రిగితే ఎలా ఉండేదో ఊహించుకోండి. ఈ మాట ఎవ‌రో కాదు, ఏపీ పోలీస్ (Police)అనుకుంటున్న వైనం స‌చివాల‌య వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. డీజీపీతో పాటు ఐపీఎస్ లంద‌రితో వీడియో కాన్ఫ‌రెన్స్ ఉండేది. ప్ర‌తి నిమిషాల‌కు ఒక‌సారి అన్ని జిల్లాల నుంచి స‌మాచారాన్ని సేక‌రించ‌మ‌ని ఆదేశాలు జారీ జ‌రిగేవి. దుండ‌గుల్ని వెంట‌నే ప‌ట్టుకోవాల‌ని పోలీస్ కు ఆదేశాలు. ఎలా జ‌రిగిందో ప్ర‌తిక్ష‌ణ మీడియాకు స‌మాచారం ఇచ్చే సెల్ పెట్టే వాళ్లు. రాత్రంతా ఆయ‌న నిద్ర‌పోకుండా అధికారులు నిద్ర‌పోనివ్వ‌కుండా చావ‌కొట్టే వాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎక్క‌డా జ‌ర‌గ‌కుండా ఆదేశిస్తూ నిఘా వ‌ర్గాల‌ను అప్ర‌మ‌త్తం చేసే యంత్రాంగం ఉండేది. నిఘాధిప‌తుల‌తో స‌మాచారం సేక‌రించి ప్ర‌జ‌ల మ‌నోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ ఆందోళ‌న చెందుతుండే వాళ్లు చంద్ర‌బాబు అంటూ స‌చివాల‌య వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌.

గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్ మీద దాడి (CBN)

కానీ, ఇప్పుడు. ఏపీ స‌చివాల‌యంలో ఎలాంటి మీటింగ్ టీడీపీ ఆఫీస్ (CBN) మీద దాడి గురించి రివ్యూ లేదు. ఎందుకు జ‌రిగిందే మీడియాకు చెప్పే వాళ్లు లేరు. నిఘాధిప‌తి ఇచ్చే స‌మాచారంపై రివ్యూ అవ‌స‌ర‌మే ఉండ‌దు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీస్ ల మీద దాడి జ‌రిగిన‌ప్ప‌టికీ దేవుడి ద‌యే. వీడియో, ఫోన్ కాన్ఫ‌రెన్స్ లు ఉండ‌వు. డీజీపీ, ఐపీఎస్ ల‌కు (Police) ఎలాంటి ఆదేశాలు ఉండ‌వు. సొంత పార్టీ వాళ్లు ఏమి చేసినా చూస్తూ ఊరుకోవాల‌ని తొలి రోజుల్లో ఇచ్చిన సంకేతాలు పోలీస్ కు చాలు. వాటిని ఫాలో అవుతూ ప్ర‌త్య‌ర్థుల మీద దాడి జ‌రుగుతున్న‌ప్ప‌టికీ నిమ్మకుండి పోతున్నారు. పైగా బాధితుల‌పై కేసులు న‌మోదు చేసి వాళ్ల‌ను అదుపులోకి తీసుకునే కొత్త సంస్కృతి ఏపీలో మొద‌ల‌యింది. ఆ విష‌యాన్ని టీడీపీ చెబుతోంది.

Also Read : Gannavaram : చంద్ర‌బాబు జాత‌కమే అంత.!న‌మ్మ‌క‌ద్రోహులుగా కొడాలి,వ‌ల్ల‌భ‌నేని!!

టీడీపీ గ‌న్న‌వ‌రం ఆఫీస్ మీద దాడి జ‌రిగిన మాట వాస్త‌వం. మాజీ మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అనుచ‌రులు దాడి చేశారు. ఆ మేర‌కు ఆధారాల‌ను టీడీపీ(CBN) అంద‌చేసింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేదు. పైగా టీడీపీ నేత ప‌ట్టాభిని అదుపులోకి తీసుకుని 24 గంట‌లు పైగా గ‌డుస్తోంది. ఆయ‌న్ను ఎక్క‌డ పెట్టారో తెలియదు. ఆయ‌న‌తో పాటు టీడీపీ లీడ‌ర్లు కొంద‌ర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ల‌ను వ‌దిలేసి, పోలీసుల మీద తిర‌గ‌బ‌డ్డార‌ని ప‌ట్టాభితో పాటు మ‌రికొంద‌రు టీడీపీ లీడ‌ర్ల మీద పోలీసులు(Police) జులుం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రం వ్యాప్తంగా 144 సెక్ష‌న్ ను పోలీసులు అమ‌లు చేస్తున్నారు.

వ‌ల్ల‌భ‌నేని ఇలాంటి దుర్ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డి ఉంటారని

గ‌తంలోనూ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించార‌ని జోగి ర‌మేష్ అనుచ‌రులు పెద్ద సంఖ్య‌లో టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీస్ ను(CBN) చుట్టుముట్టారు. ఆ సంద‌ర్భంగా అక్క‌డున్న టీడీపీ ఆఫీస్ బేర‌ర్లు ప్రాణాల‌ను అర‌చేతిలో ప‌ట్టుకుని బ‌య‌ట‌ప‌డ్డారు. చేతికందిన వ‌స్తువుల‌ను ప‌గుల‌కొట్టి విధ్వంసం సృష్టించారు. వాళ్ల మీద ఇప్ప‌టి వ‌ర‌కు కేసు లేక‌పోగా, దాడికి నాయ‌క‌త్వం వ‌హించిన జోగికి మంత్రి ప‌ద‌విని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌ట్ట‌బెట్టారు. అంటే, ప‌రోక్షంగా ఈ దాడుల‌ను ఆయ‌న ప్రోత్స‌హిస్తున్నార‌ని లీడ‌ర్ల‌కు సంకేతం వెళ్లింది. దాడుల చేయించే వాళ్ల‌కు ప‌ద‌వులు ఇస్తార‌న్న సంకేతం వెళ్ల‌డంతో ఇప్పుడు వ‌ల్ల‌భ‌నేని కూడా ఇలాంటి దుర్ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డి ఉంటారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : TDP vs YCP : గ‌న్న‌వ‌రంలో మ‌రోసారి ఉద్రిక్త‌త‌.. మ‌రో కారుని త‌గ‌ల‌బెట్టిన వైసీపీ నేత‌లు

సాధార‌ణంగా నిఘా వ‌ర్గాలు ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంటాయి. పార్టీల మీద ఎక్కువ‌గా క‌న్నేసి ఉంటారు. ఎక్క‌డ ఏమి జ‌రుగ‌నుందో ముందుగానే పసిగ‌డ‌తారు. అందుకు సంబంధించిన స‌మాచారాన్ని పోలీస్ శాఖ‌కు(Police) ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తారు. కానీ, గ‌న్న‌వ‌రం, గ‌తంలో జ‌రిగిన టీడీపీ కేంద్ర ఆఫీస్ సంఘ‌ట‌న‌ల మీద నిఘా అప్ర‌మ‌త్తం చేయ‌లేక‌పోయిందా? లేక పోలీసులు చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేశారా? అనేది సందిగ్ధం. ఏపీ పోలీస్ స‌త్తా ఏమిటో తెలిసిన వాళ్లు మాత్రం నిఘా వ‌ర్గాల‌కు తెలియ‌కుండా ఏదీ జ‌రిగే ఛాన్స్ లేదంటున్నారు. అంటే, ముందే స‌మాచారం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ పెద్ద‌ల సంకేతాల‌తో పోలీసులు మౌన‌పాత్ర పోషించార‌న్న‌మాట‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏపీలో లా అండ్ ఆర్డ‌ర్ గ‌ట్టుత‌ప్పిన‌ట్టే. రాబోవు రోజుల్లో ప్ర‌త్య‌ర్థులు నోరుతెరిస్తే దాడులు ఉంటాయ‌న్న భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించార‌ని అర్థ‌మ‌వుతోంది. అందుకే, స‌చివాల‌య వ‌ర్గాల్లో ఇప్పుడు చంద్ర‌బాబు(CBN) సీఎంగా ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుంటూ ఆస‌క్తిగా మాట్లాడుకోవ‌డం వినిపిస్తోంది.