టీడీపీ మహిళా ఎమ్మెల్యే పై క్షుద్రపూజలు..

Bandaru Sravani  ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్లనువ్వులు పడేసి వెల్లడం తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా, […]

Published By: HashtagU Telugu Desk
TDP MLA Bandaru Sravani House

TDP MLA Bandaru Sravani House

Bandaru Sravani  ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్లనువ్వులు పడేసి వెల్లడం తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు.

తాజాగా ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా, కారు అతివేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ కారుకు ఏపీ 39 కేఎక్స్ 0986 నంబర్ ఉన్నట్లు గుర్తించారు.

ఇటీవలి కొన్ని నెలలుగా తమ ఇంటి వద్ద ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనల కారణంగా తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక శింగనమల నియోజకవర్గానికి చెందిన ఓ అసమ్మతి నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని వారు ఆరోపించారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్‌తో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

  Last Updated: 07 Feb 2026, 11:12 AM IST