Site icon HashtagU Telugu

Republic Day Parade : ఆకట్టుకున్న ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం

Etikoppaka Bommalu Shines

Etikoppaka Bommalu Shines

ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ (Republic Day Parade) వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం (Etikoppaka Bommalu Shines) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటం పర్యావరణ హితంగా తయారు చేసిన ఏటికొప్పాక బొమ్మల అందాన్ని, ప్రతిష్టను ప్రతిబింబించింది. స్థానికంగా లభించే చెక్కతో, ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా తయారైన ఈ బొమ్మలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ పరేడులో మొత్తం 26 శకటాలను ప్రదర్శించగా.., అందులో 16 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి కాగా, 10 కేంద్ర ప్రభుత్వ సంస్థల శకటాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కాయి.

Vijaysai Reddy Plan : వ్యవసాయం కాదు.. విజయసాయిరెడ్డి ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?

ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక బొమ్మల శకటం (Etikoppaka Dolls) ప్రదర్శన అందర్నీ కట్టిపడేసింది. విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఈ బొమ్మలు 400 ఏళ్ల చరిత్రను కలిగి ఉంటాయి. ప్రత్యేకంగా అంకుడు కర్రతో చేతితో తయారు చేయబడే ఈ బొమ్మలు తమ నాణ్యత మరియు కళాత్మకతకు ప్రసిద్ధి పొందాయి. ఏటికొప్పాక బొమ్మలు 2017లో భౌగోళిక గుర్తింపు (GI Tag) పొందడం ఈ కళకు గ్లోబల్ గుర్తింపునిచ్చింది. ఈ బొమ్మలు పూర్తిగా పర్యావరణ అనుకూలమైన పద్ధతుల్లో తయారు చేయబడతాయి. రసాయనాల వాడకం లేకుండా, సహజంగా లభించే వర్ణాలతో ఈ బొమ్మలు తయారు చేయబడటం వాటి ప్రత్యేకత.

గణతంత్ర పరేడులో ఈ శకటానికి స్థానం దక్కడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సంప్రదాయ కళకు, హస్తకళలకు ఒక అంతర్జాతీయ వేదిక లభించింది. పరేడ్‌లో ప్రదర్శించిన శకటంలో ఏటికొప్పాక బొమ్మల తయారీ విధానం, వాటి వినియోగంపై వివరాలు అందించారు. ఈ బొమ్మలు పిల్లల ఆట బొమ్మలుగా మాత్రమే కాకుండా, ఇంటీరియర్ డెకరేషన్‌లోనూ విరివిగా ఉపయోగించబడుతున్నాయి. ఇలాంటి పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల ప్రాచుర్యానికి ఇది గొప్ప వేదికగా మారింది.

All about Anuja : ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘అనూజ’.. ఏమిటీ సినిమా స్టోరీ ?

ఈ ప్రదర్శన ద్వారా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం, గ్రామీణ కళల విలువలను తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రతి సంవత్సరం పరేడ్‌లో రాష్ట్రాల ప్రత్యేకతలను చూపించే శకటాలు గర్వకారణంగా నిలుస్తాయి. ఈసారి ఏటికొప్పాక బొమ్మల శకటం ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టను పెంచింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘బొమ్మలమ్మ.. బొమ్మలు’ అంటూ సాగే పాటతో ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో సాగిన శకటాల పరంపరలో ప్రత్యేక ఆకర్షణగా మన ఏటికొప్పాక బొమ్మల కొలువు నిలిచిందని తెలిపారు. మన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధాని నరేంద్రమోడితో సహా ప్రముఖులందరిని ఆకట్టుకున్నదని తెలిపారు. దీనికి కారణభూతులైన వారందరిని చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.