Site icon HashtagU Telugu

AP Employees : ఏపీ ఉద్యోగ సంఘం విజ‌యం! `సుప్రీం` దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ !

Ap Employees

Ap Employees

ఏపీ ఉద్యోగుల‌కు(AP Employees)  హైకోర్టులో తాత్కాలిక ఊర‌ట ల‌భించింది. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టు వ‌ర‌కు తీసుకెళ్ల‌డానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ద‌మ‌యింద‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకంగా గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ కు ఏపీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేయ‌డాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి( Jagan) స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ నోటీసులు జారీ చేసిన విష‌యం విదిత‌మే. వాళ్ల మీద చ‌ర్యలు తీసుకోవ‌డానికి ముందడుగు వేసింది.

ఏపీ ఉద్యోగుల‌కు హైకోర్టులో తాత్కాలిక ఊర‌ట(AP Employees)  

ప్ర‌భుత్వం జారీ చేసిన నోటీసును స‌వాల్ చేస్తూ హైకోర్టుకు ఏపీ ఉద్యోగుల సంఘం నాయ‌కులు(AP Employees) వెళ్లారు. వాళ్లి పిటిష‌న్ మీద బుధ‌వారం విచారించిన హైకోర్టు జస్టిస్ రవినాథ్ తిలహరి స్టే మంజూరు చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ఉద్యోగుల‌కు ల‌భించింది. అయితే, ఆ ఫిర్యాదు వెనుక ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఉన్నాయ‌ని వైసీపీ అనుమానిస్తోంది. రాజ‌కీయ ప‌రంగా చంద్ర‌బాబుకు ప‌రోక్ష మ‌ద్ధ‌తు ఏపీజీఈఏ అధ్య‌క్షుడు సూర్య‌నారాయ‌ణ అందిస్తున్నార‌ని భావిస్తోంది. అందుకే, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉండే ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను వైసీపీ(Jagan) చేర‌తీసింది. వాళ్ల‌తోనే సూర్య‌నారాయ‌ణ మీద ఆరోప‌ణ‌లు చేసేలా ప్లాన్ చేసింది.

Also Read : AP Employees : ఉద్యోగ సంఘం నేతకు జగన్ మార్క్ తీర్పు?బండి తడాఖా

ఏపీజీఈఏ అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జనవరి 19న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను క‌లిసింది. ఉద్యోగులు  ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం జోక్యం చేసుకావాల‌ని కోరారు. ప్రభుత్వానికి అవసరమైన సలహాలు ఇవ్వాలని ప్రతినిధి బృందం గవర్నర్‌ను అభ్యర్థించింది. ఆ భేటీ త‌రువాత ఏపీజీఈఏ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం(Jagan) ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనందున గవర్నర్‌ను కలవాల్సి వచ్చిందన్నారు.

సంఘానికి ఎందుకు గుర్తింపు ర‌ద్దు చేయ‌కూడ‌దో..

ఏపీజీఈఏ నేతల (AP Employees) చర్యను సీరియస్‌గా ఆనాడే ప్రభుత్వం సీరియ‌స్ గా తీసుకుంది. సంఘానికి ఎందుకు గుర్తింపు ర‌ద్దు చేయ‌కూడ‌దో వివరించాలని కోరుతూ జనవరి 23న షోకాజ్ నోటీసు జారీ చేసింది. సూర్యనారాయణ ఆ షోకాజ్ నోటీసును హైకోర్టులో సవాలు చేశారు. సంఘంపై చర్యలు తీసుకోవద్దని జనవరి 31న కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లోని హక్కులు గురించి ప్ర‌స్తావించారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగ సంఘం నేత‌లు నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

న్యాయ‌పోరాటం చేయ‌డానికి ప్ర‌భుత్వం ముందుకెళ్ల‌నుంద‌ని..(Jagan)

1990 ఆర్థిక నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు(AP Employees) ప్రతినెలా చివరి పనిదినాన జీతాలు చెల్లించాల‌ని కోరారు. అయితే వచ్చే నెల 15 వరకు ఉద్యోగులకు ప్రస్తుత నెల జీతాలు అందడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది రవిప్రసాద్ కోర్టుకు తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం లేదని సూర్యనారాయణ ఆరోపించారు. 90వేల‌ మందికి పైగా ఉద్యోగుల ఖాతాల నుంచి వారి అనుమతి లేకుండానే ప్రభుత్వం రూ.415 కోట్ల జీపీఎఫ్ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసిందని ఉద్యోగ సంఘం నేత‌లు న్యాయ‌స్థానం ముందు ఉంచారు. హైకోర్టులో ఉద్యోగ సంఘానికి ఊర‌ట ల‌భించిన‌ప్ప‌టికీ న్యాయ‌పోరాటం చేయ‌డానికి ప్ర‌భుత్వం(Jagan) ముందుకెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.

Also Read : AP Employees : జీతాలిస్తే చాలు,ఇంకేమొద్దు! ఉద్యోగుల‌కు త‌త్త్వం బోధ‌ప‌డి.!

Exit mobile version