Buddha Vs KTR : బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించినా, కేటీఆర్‌కు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలోనూ కేటీఆర్ ఇలాగే వాగారని విమర్శించారు. హైదరాబాద్‌లో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకొని కేటీఆర్ అప్పట్లో వెకిలి వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ‘‘నిరసనలను పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు, తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు(Buddha Vs KTR) కూలింది. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకు పోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడమే ప్రధాన కారణం. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడితే ప్రజలు శాస్తి చేశారు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబును అరెస్టు చేస్తే వంద దేశాల్లో నిరసనలు తెలిపారు. ఆయన స్ఠానమేంటో కేటీఆర్ లాంటి వాళ్లు అర్థం చేసుకోవాలి’’ అని కోరారు.
చంద్రబాబు గురించి మీ నాన్నకు తెలుసు
‘‘వైఎస్ జగన్ లాంటి అవినీతి పరుడితో జతకట్టిన కేటీఆర్‌కు నీతులు చెప్పే అర్హత లేదు. కేటీఆర్ ఇకనైనా నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో. తెలంగాణాలోనే బీఆర్‌ఎస్‌కు దిక్కు లేదు. ఇక ఏపీ గురించి మీకు మాటలెందుకు ?’’ అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఇవాళ (సోమవారం) మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇలాగే వ్యవహరిస్తే సిరిసిల్లలో కూడా గెలిచే అవకాశం ఉండదని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ లాంటి వాళ్లు వాగినంత మాత్రాన, చంద్రబాబు గొప్పతనం తగ్గదన్నారు. ‘‘చంద్రబాబు గురించి నీకు తెలియదేమో.. మీ నాన్నకు తెలుసు’’ అని వెంకన్న చెప్పారు. ‘‘ఏపీకి పెట్టుబడులు వచ్చినందుకు కేటీఆర్ రగిలిపోవడం కరెక్ట్ కాదు. ఏపీకి బ్రాండ్ అంటే చంద్రబాబు. ప్రపంచ దేశాలు ఆయన్ను చూసి ఏపీకి వస్తాయి’’ అని బుద్ధా వెంకన్న తెలిపారు. ‘‘ఏపీ గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ మాట్లాడేటప్పులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read :Shock To Lalit Modi: భారత్ ఎఫెక్ట్.. లలిత్ మోడీకి వనౌతు పాస్‌పోర్ట్ రద్దు
చంద్రబాబు నన్ను టెస్ట్ చేస్తున్నారు
తనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు నాకు దేవుడు. నేను ఆయన భక్తుడిని. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్షలు పెడతాడు. నాకు పదవి వచ్చినా రాకపోయినా అంకిత భావంతో పనిచేస్తా. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడ. పదవి రాకపోయినా బాధ పడను. కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.