ADR Report : చంద్ర‌బాబు ముందు జ‌గన్మోహ‌న్ రెడ్డి పేదోడే.!

చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయం సంప‌న్నంగా(ADR Report) మారింది.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 02:54 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయం సంప‌న్నంగా(ADR Report) మారింది. వాళ్లిద్ద‌రిలో ఎవ‌రు రిచ్(Richest) అనేది ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లోని కీ పాయింట్ . ఎవ‌రికివారే అనుకూలంగా ఏడీఆర్ రిపోర్ట్ ను మ‌ల‌చుకుంటున్నారు. దేశంలోని 30 రాష్ట్రాల సీఎంల‌లో నెంబ‌ర్ 1 ఆస్తిప‌రుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఏపీ ఆర్థికంగా వెనుక‌బాటులో ఉన్న‌ప్ప‌టికీ జ‌గన్మోహ‌న్ రెడ్డి ఆస్తులు మాత్రం ఆమాంతం పెరిగాయి. అందుకే, ఆయ‌న దేశంలోనే రిచ్ సీఎంగా మారాడ‌ని టీడీపీ ఆరోపిస్తోంది.

  చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంప‌న్న  రాజ‌కీయం (ADR Report)

ల‌క్ష కోట్ల అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ప‌దేళ్ల క్రితం టీడీపీ ఆరోప‌ణ చేసింది. క్విడ్ ప్రో కో కింద ల‌క్ష కోట్లు (Richest)సంపాదించాడ‌ని బుక్ కూడా వేసింది. ఢిల్లీ వేదిక‌గా పంపిణీ కూడా చేసింది. ఆనాడు ఉమ్మ‌డి సీఎంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు కుమారుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తులు కూడ‌బెట్టాడ‌ని టీడీపీ చేసే ప్ర‌ధాన ఆరో్ప‌ణ‌. అందుకు సంబంధించిన విచార‌ణ కూడా జ‌రుగుతోంది. ఆయ‌న అక్ర‌మ సంపాద‌న మీద సీబీఐ, ఈడీలు విచార‌ణ చేశాయి. ప‌లు చార్జిషీట్ల‌ను కూడా కోర్టుల్లో వేశాయి. సుమారు 33వేల కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను అటాచ్ కూడా ద‌ర్యాప్తు సంస్థ‌లు చేశాయ‌ని ఆ మ‌ధ్య వ‌చ్చిన న్యూస్. తాజాగా అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) రిపోర్ట్ (ADR Report)ప్ర‌కారం దేశంలోనే ధ‌నిక సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని తేల్చింది. దీంతో మ‌రోసారి ఆయ‌న అక్ర‌మ సంపాద‌న చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అత్యంత ధ‌నిక సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

నాలుగేళ్ల‌లో 2లక్ష‌ల కోట్లు అవినీతికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ పాల్ప‌డింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు గుడివాడ స‌భ‌లో ఆరోప‌ణ‌లు గుప్పించారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ వ్య‌క్తిగ‌త సంప‌ద‌ను(Richest) పెంచుకున్నాడ‌ని విమ‌ర్శించారు. తాజాగా ఏడీఆర్ రిపోర్ట్ (ADR Report)లో అత్యంత ధ‌నిక సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలిచాడ‌ని గుడివాడ స‌భ‌లో వెల్ల‌డించారు. ఏడీఆర్ రిపోర్ట్ లోని ధ‌నిక సీఎంల జాబితాను ప‌రిశీలిస్తే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నెంబ‌ర్ 1 ప్లేస్ లో ఉన్నారు.

అతి తక్కువగా ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా

దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR Report)నివేదిక వెల్లడించింది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తులు రూ.33.96 కోట్లుగా ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. ముఖ్యమంత్రుల అంద‌రి కంటే ఏపీ సీఎం జగన్ అత్యధికంగా రూ.510 కోట్ల ఆస్తులతో టాప్ ఉన్నారు. అతి తక్కువగా కేవలం రూ.15 లక్షల ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం జగన్ తర్వాత అధిక ఆస్తులను అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన పెమా ఖండూ (రూ.163 కోట్లకు పైగా) కలిగివున్నట్లు ఏడిఆర్ సంస్థ తెలిపింది. మూడో ధనిక సీఎంగా ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ (రూ.63 కోట్లకు పైగా) నిలిచారు. ఇక అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా మమత నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో కోటి రూపాయల ఆస్తులతో కేరళ సీఎం పినరయి విజయన్, కోటికి పైగా ఆస్తులతో హర్యానా సీఎం మనోహర్ లాల్ నిలిచారు.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు కూడా రూ.3 కోట్లకు పైగా ఆస్తులు కలిగి వున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR Report)నివేదిక బయటపెట్టింది.

చంద్రబాబు దేశంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే (Richest)

విచిత్రంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రస్తుత సీఎం జగన్  కంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భారీ ఆస్తులు(Richest) కలిగివున్నట్లు బయటపడింది. రూ.668 కోట్ల ఆస్తులతో చంద్రబాబు దేశంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో మూడోస్థానంలో నిలిచారు. ఏపీలో అత్యంత ధనిక ఎమ్మెల్యే చంద్రబాబేనని ఏడిఆర్ నివేదిక(ADR Report) వెల్లడించింది. దేశంలోని ఎమ్మెల్యేలందరి కంటే అత్యధిక ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేగా మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎన్ నాగరాజు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.1,015 కోట్లుగా ఏడిఆర్ పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన డికె శివకుమార్ నిలిచారు. ఆయ‌న‌ ఆస్తుల విలువ రూ.840 కోట్లు. వీరి తర్వాత రూ.668 కోట్ల ఆస్తులతో చంద్రబాబు మూడోస్థానంలో నిలిచారు.

Also Read : Chandrababu: గుడివాడలో చిన్న సైకో.. ఇదేం ఖర్మలో చంద్రబాబు..!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కంటే రూ. 158 కోట్ల రూపాయ‌ల సంప‌ద‌ను ఎక్కువ‌గా టీడీపీ అధినేత చంద్ర‌బాబు(Richest) క‌లిగి ఉన్నారు. ఎన్నిక‌ల అఫిడ‌విట్ ఆధారంగా ఏడీఆర్ సంప‌న్న రాజ‌కీయ నేత‌ల జాబితాను త‌యారు చేసింది. దాని ప్ర‌కారం జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు ఆస్తిప‌రుడు. వాస్త‌వాలు ఇలా ఉండ‌గా, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అత్యంత సంపన్న సీఎంగా ఏడీఆర్ (ADR Report)పేర్కొన‌డాన్ని హైలెట్ చేశారు. ముఖ్య‌మంత్రిల జాబితాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టాప్ లో ఉన్నారు. అదే, ఎమ్మెల్యేల జాబితాలో మాత్రం చంద్ర‌బాబు అత్యంత ధ‌నికుడిగా తేల్చారు. అంటే, ఏపీలోని ఎమ్మెల్యేలు జ‌గ‌న్ తో స‌హా అంద‌రి కంటే చంద్ర‌బాబు ఎక్కువ ధ‌నివంతుడు. ఈ కోణాన్ని వైసీపీ బ‌య‌ట‌కు తీసింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంప‌ద మీద నెగ‌టివ్ ప్ర‌చారం చేసిన మీడియా ఇప్పుడు నాలుక్క‌రుచుకుంటోంది.

Also Read ; Jagan : చంద్ర‌బాబు సెల్పీ ఛాలెంజ్ కు జ‌గ‌న్ మ‌రో ఛాలెంజ్‌