- జూలై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- జూలై 17: ఆణివార ఆస్థానం
- జూలై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమం స్వామీజీకి పెద్ద మర్యాద
- జూలై 29: శ్రీ జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
- ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ
- ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండో రోజు (పవిత్రాల సమర్పణ)
- సెప్టెంబర్ 8: శ్రీవారి బ్రహ్మోత్సవాల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- సెప్టెంబర్ 14: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయం
జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకో ముఖ్య గమనిక. ఈ మూడు నెలలకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూడు నెలల కాలంలో వివిధ పర్వదినాలు, ఉత్సవాలు తిరుమలలో జరగనున్నాయి. దీంతో ఆయా రోజులలో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆ వివరాలు ముందుగా తెలుసుకుంటే శ్రీవారి దర్శనానికి వీఐపీ సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పుతాయి.
జులై నెలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు వివరాలు..
జులై నెలకు సంబంధించి 14, 17, 19, 29వ తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జులై 14వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17వ తేదీ ఆణివార ఆస్థానం, 19న ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాలను భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.
ఆగస్ట్ నెల విషయానికి వస్తే.. ఆగస్ట్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్ట్ 22వ తేదీ పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే ఆగస్ట్ 24వ తేదీ పవిత్రాల సమర్పణ సందర్భంగా ఈ దర్శనాలు రద్దు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయా రోజులలో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ కారణంగా సెప్టెంబర్ ఎనిమిదో తేదీ కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసే సెప్టెంబర్ 14వ తేదీ కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో పేర్కొంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని.. వీఐపీ బ్రేక్ దర్శనాల నేపథ్యంలో ఆయా ముందు రోజులలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.
