Womens Revenge : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని.. కమలా హ్యారిస్‌కు మద్దతు పలికే చాలామంది మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రంప్ గెలవడానికి ప్రధాన కారణం అమెరికాలోని పురుషులే అని వారు వాదిస్తున్నారు. ట్రంప్‌ను ఎన్నికల్లో గెలిపించి పెద్ద తప్పు చేసినందుకు పురుషులకు తగిన శాస్తి చేస్తామని, వారిపై ‘4బీ ప్రతీకారం’ తీర్చుకుంటామని పలువురు మహిళలు, యువతులు హెచ్చరిస్తున్నారు.
Also Read :Head In Cage : పంజరంలో తల.. స్మోకింగ్ మానేందుకు విచిత్ర శిక్ష
సెక్స్‌లో పాల్గొనకపోవడం, రిలేషన్ షిప్ ఆపేయడం, పెళ్లి చేసుకోకపోవడం, పిల్లలను కనకపోవడం అనే నాలుగు అంశాలు ‘4బీ ప్రతీకారం’(Womens Revenge) పరిధిలోకి వస్తాయి. ఈ నాలుగు మార్గాల్లో తాము ఇక పురుషులపై ప్రతీకారం తీర్చుకోబోతున్నామని సదరు మహిళలు, యువతులు అంటున్నారు. ఈమేరకు రాసిన ప్లకార్డులతో అమెరికాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. వీటిపై అక్కడి మీడియాలో వార్తలు సైతం పబ్లిష్ అయ్యాయి. వాస్తవానికి ‘4బీ ప్రతీకారం’ అనే భావన దక్షిణ కొరియాలో ఉంటుంది. అది కాస్తా ఇప్పుడు అమెరికాకు చేరింది. ‘బీ’ అంటే దక్షిణ కొరియా భాషలో ‘నో’ అని అర్థం.
Also Read :Praja Vijaya Utsavalu : నవంబరు 14 నుంచి డిసెంబరు 9 వరకు ప్రజా విజయోత్సవాలు : భట్టి
‘మీ టూ’ ఉద్యమం తర్వాత 2021 సంవత్సరంలో దక్షిణ కొరియాలో ‘4బీ’ ఉద్యమం జరిగింది. అప్పట్లో దీనిపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి అడ్డదిడ్డమైన ఉద్యమాల వల్ల దంపతుల మధ్య సఖ్యత దెబ్బతింటుంది. సంసార బంధం తెగిపోతుంది. ఇలాంటి వాటిని ఉద్యమాలు అనడం కూడా కరెక్టు కాదు’’ అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద 2021 సంవత్సరంలో 4బీ ఉద్యమం వల్ల దక్షిణ కొరియాలో జననాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పుడు అమెరికాలోని పలువురు మహిళలు, యువతులు 4బీ ఉద్యమంలోకి వచ్చారు. ఇక అగ్ర రాజ్యంలోనూ జననాలు తగ్గుతాయో లేదో వేచిచూడాలి.