US Election Winner : ఎన్నికల టైంలో.. బెట్టింగ్స్, పందేలు సీక్రెట్‌గా తెరచాటున జరుగుతుంటాయి. అలా చేసే చాలామందిని పోలీసులు పట్టుకొని కటకటాల వెనక్కి నెడుతుంటారు. ఇవాళ ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు కాబోయే అమెరికా అధ్యక్షుడు ఎవరు ? అనేది తెలుసుకునేందుకు నీటిగుర్రాలను (హిప్పోలు) రంగంలోకి దింపారు. గెలవబోయేది కమలా హ్యారిసా ? డొనాల్డ్ ట్రంపా ? అనే దానిపై రెండు నీటి గుర్రాలతో జోస్యం చెప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :Wikipedia : తప్పుల తడకగా వికీపీడియా పేజీలు.. కేంద్రం నోటీసులు
థాయ్‌లాండ్‌లోని సి రాచా ప్రాంతంలో ఉన్న ఖావో ఖీవ్ జంతు ప్రదర్శన శాలలో ఉన్న మూ డెంగ్ అనే పొట్టి హిప్పోకు ఇవాళ రెండు పుచ్చకాయ కేకులను ఆఫర్ చేశారు. వాటిలో ఒకదానిపై థాయ్ భాషలో ట్రంప్ అని, మరొక దానిపై కమల అని పేర్లను రాశారు. అయితే వాటిలో ట్రంప్ పుచ్చకాయ కేకును మూ డెంగ్ తినేసింది. ఈరకంగా ట్రంప్ గెలుస్తారని అది జోస్యం చెప్పింది. ఇదే జూలో ఉన్న పెద్ద హిప్పో మాత్రం.. కమల పేరు ఉన్న పుచ్చకాయను తినేసింది. ఒక్కో హిప్పో ఒక్కోలా జోస్యం చెప్పడంతో.. ఈసారి అమెరికా ఎన్నికల్లో టఫ్ ఫైట్ జరుగుతుందనే అంచనాకు సోషల్ మీడియా లవర్స్(US Election Winner) వచ్చారు. ఖావో ఖీవ్ జంతు ప్రదర్శన శాలలో చిన్న హిప్పో మూ డెంగ్ చాలా ఫేమస్. దాన్ని సెలబ్రిటీ హిప్పో అని పిలుస్తుంటారు. దీన్ని రాజకీయ విశ్లేషకురాలిగా పొగుడుతుంటారు. ఇది ఈ ఏడాది జులైలోనే పుట్టింది. థాయ్‌లాండ్ ఇంటర్నెట్‌లో మూ డెంగ్ ఒక సెన్సేషన్‌గా వెలుగొందుతోంది.
Also Read :Private Property : ప్రైవేటు ప్రాపర్టీల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
Im not saying this is good omen but i would take anything… 😆 Moo Deng, the famous baby hippo, predicts Donald Trump will win the #Election2024 .
The hippo must be a true #patriot pic.twitter.com/nrw4Q28G7v— motivate 4 life 🇺🇲 (@imotivate4life) November 4, 2024