Site icon HashtagU Telugu

China Vs US : అమెరికా నీచం.. చైనా ఉద్యోగులు, సైనికులకు ఓపెన్ ఆఫర్

China Vs Us Intelligence Agency Cia Offer China Army Spying On China Chinese People

China Vs US : ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాను ఢీకొనే బలమైన సైనిక శక్తులు ఏవైనా ఉన్నాయి అంటే.. అవి చైనా, రష్యాలే. అందుకే ఆ రెండు దేశాల్లో రహస్య గూఢచారుల రిక్రూట్‌మెంట్, వారి నిర్వహణ కోసం అమెరికా ఏటా భారీగా ఖర్చు పెడుతోంది. ఆయా దేశాల్లో  అమెరికా గూఢచారులుగా ఎంపికయ్యే వారు.. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. రహస్య సమాచారాన్ని సేకరించి సీఐఏకు చేరవేస్తుంటారు. ఇక గూఢచారులు అంటే తెలుసుగా.. మారువేషంలో తిరుగుతూ కావాల్సిన పనులన్నీ తెలివిగా చక్కబెట్టుకునేవారు.

Also Read :Police Vehicles Vs Challans : పోలీసు వాహనాలపై 17,391 పెండింగ్‌ ఛలాన్లు.. అర కోటికిపైనే బకాయీ

రష్యాలో భారీగానే అమెరికా గూఢచారులు

రష్యా దేశం అనేది ఓపెన్ మార్కెట్. అక్కడి ఆర్థిక వ్యవస్థ ప్రపంచదేశాల కోసం ఓపెన్‌గా ఉంది. రష్యాకు వెళ్లి ఏ కంపెనీ అయినా పని చేయొచ్చు. ఎవరైనా అక్కడికి  ఈజీగా టూర్‌కు వెళ్లి రావచ్చు. కంపెనీలపై, టూరిస్టులపై పెద్దగా నిఘా ఉండదు. ఈ అంశాలను సాకుగా తీసుకొని రష్యాలో  పెద్దసంఖ్యలోనే గూఢచారులను అమెరికా తయారు చేసుకోగలిగింది.

చైనాలో అమెరికా ఆటలు సాగవు

చైనాలో మాత్రం అమెరికా గూఢచార సంస్థ సీఐఏ(China Vs US) ఆటలు సాగడం లేదు. ఎందుకంటే చైనాలోకి అడుగుపెట్టే ప్రతీ టూరిస్టుపై, ప్రతీ విదేశీయుడిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. దీంతో వాళ్లు టూర్‌‌లో ఎంజాయ్ చేయడానికి మించి, ఇంకేం చేయలేరు, చైనా ప్రభుత్వానికి సంబంధించి కానీ, చైనా సైన్యానికి సంబంధించి కానీ రహస్య సమాచారాన్ని సేకరించడం కుదరదు. ఇక విదేశీ కంపెనీలను ఎడాపెడా అనుమతులు ఇచ్చే ట్రెండ్ కూడా చైనాలో లేదు. చైనాలో కార్యకలాపాలు సాగించే విదేశీ కంపెనీలు వినియోగించే టెక్నాలజీపై ప్రత్యేక నిఘా ఉంటుంది. వాటిలో పనిచేసే విదేశీ ఉద్యోగుల మెయిల్స్,  కాల్స్, మెసేజ్‌లపైనా మానిటరింగ్ జరుగుతుంది. అందుకే గూఢచర్యానికి ఛాన్స్ ఉండదు. ఇదంతా చూసి అమెరికా సీఐఏ చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉంది.

Also Read :Nuclear Strike : పాక్ అణ్వాయుధం ప్రయోగిస్తే.. భారత్ ఇలా అడ్డుకుంటుంది

సీఐఏ రెండు సంచలన వీడియోల్లో.. ఏముంది ? 

పై విషయమంతా చదివారుగా.. అందుకే అమెరికా సీఐఏ సంచలన ప్రకటన విడుదల చేసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పాలనలో అణచివేతను ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, సైనిక అధికారులు తమ గూఢచారులుగా మారాలని పిలుపునిచ్చింది. చైనా ప్రభుత్వ, సైనిక రహస్యాలను తమకు తెలియజేయాలని కోరింది. ఈమేరకు రెండు వీడియోలను సీఐఏ యూట్యూబ్‌, ‘ఎక్స్‌’ ఖాతాల్లో అమెరికా సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ మాండరిన్ (చైనీస్) భాషలో విడుదల చేయడం గమనార్హం. వీటికి గంటల వ్యవధిలోనే 50 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ‘‘నా జీవితాన్ని, నా భవిష్యత్తును నా కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే సీఐఏలో చేరాలి’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోలను విడుదల చేయడం గమనార్హం.  ‘‘జిన్‌పింగ్‌ కమ్యూనిస్టు పార్టీలో అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాచుకున్న నిప్పు’’  అంటూ సినిమాటిక్‌ సన్నివేశాలను ఈ వీడియోలలో జోడించారు. అమెరికాకు వ్యతిరేకంగా చైనా చేపడుతున్న గూఢచర్య ఆపరేషన్లకు కౌంటర్‌గానే ఇవన్నీ చేస్తున్నట్లు సీఐఏ వర్గాలు చెబుతున్నాయి.  ఇతర దేశాల ప్రభుత్వ ఉద్యోగులను, సైనిక అధికారులను గూఢచారులుగా మార్చుకోవడం కరెక్టేనా ? అస్సలు కాదు. దీన్నిబట్టి అమెరికా దేశపు విదేశాంగ విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇదే విధంగా ఇతర దేశాలతోనూ అమెరికా వ్యవహరించే ముప్పు ఉంది.