Turkish Warplanes : ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌లోకి ఒక దేశానికి చెందిన సీ-130 హెర్క్యులస్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో పాకిస్తాన్ సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఈ యుద్ధ విమానాలను ఏ దేశం పంపిందో తెలుసా.. ? దీనికి సమాధానం.. టర్కీ (తుర్కియే).
Also Read :Bhoodan Land Scam: భూదాన్ భూములతో ‘రియల్’ దందా.. పాతబస్తీలో ఈడీ రైడ్స్
టర్కీ నుంచి పాక్‌కు ఏం అందింది ?
భారత్ ఒకవేళ యుద్ధానికి దిగితే .. ఎలా ? అనే ఆందోళన ప్రస్తుతం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. ఈ తరుణంలో అది తన మిత్రదేశాలైన చైనా, టర్కీ, సౌదీ అరేబియాలను సాయం కోరినట్లు తెలుస్తోంది. చైనా నుంచి భూమార్గం మీదుగా పాకిస్తాన్‌కు ఆయుధాలు(Turkish Warplanes), క్షిపణులు సప్లై అవుతున్నట్లు సమాచారం. ఇక టర్కీకి చెందిన సీ-130 హెర్క్యులస్ యుద్ధ విమానాలు ఆయుధ సామగ్రితో పాక్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న మిలిటరీ ఎయిర్ బేస్‌లో దిగాయి. చైనా-పాకిస్తాన్, టర్కీ – పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. వీటిలో భాగంగా యుద్ధ సమయాల్లో పరస్పర సహకారం చేసుకోవాలి. ఈక్రమంలోనే పాకిస్తాన్‌కు టర్కీ ఆపన్న హస్తం అందిస్తోందని అంటున్నారు. అయితే టర్కీ నుంచి పాకిస్తాన్‌కు ఎలాంటి ఆయుధ సామగ్రి సప్లై అవుతోందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో టర్కీ చాలా అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉంది. బహుశా వాటితో ముడిపడిన సహాయాన్ని పాకిస్తాన్ పొంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read :Ban On Pak : మరో డిజిటల్ స్ట్రైక్.. పాక్ యూట్యూబ్, స్పోర్ట్స్ ఛానళ్లపై బ్యాన్
‘స్కర్దు’ నుంచి భారత్‌పైకి గురి ?
ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఎఫ్-16, జేఎఫ్-17, జే-10 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని వైమానిక స్థావరాల్లో సిద్ధంగా ఉంచారు. పెట్రోలింగ్ యుద్ధ విమానాలతో ఇప్పటికే పాకిస్తాన్ గగనతలంతో ముమ్మర పెట్రోలింగ్ జరుగుతోంది. భారత్ దాడి చేస్తుందనే భయంతోనే ఇదంతా పాకిస్తాన్ ఆర్మీ చేస్తోంది. పాకిస్తాన్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న స్కర్దు వైమానిక స్థావరాన్ని కూడా పాకిస్తాన్ తిరిగి ప్రారంభించింది. భారత్‌తో యుద్ధం జరిగితే.. స్కర్దు వైమానిక స్థావరాన్ని కేంద్రంగా చేసుకోవాలని పాకిస్తాన్ ఆర్మీ భావిస్తోంది. అక్కడి నుంచే భారత్‌పై నిఘా పెట్టడంతో పాటు యుద్ధ విమానాలను దాడికి పంపాలని అనుకుంటోంది.