Turkey Army In Pak : టర్కీ దేశం మొదటి నుంచే భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. కశ్మీరు అనేది పాకిస్తాన్ సొత్తు అనేలా ఆది నుంచీ టర్కీ వాణిని వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతూ టర్కీ గొంతు విప్పుతోంది. అయినా టర్కీతో భారత్ స్నేహాన్ని కొనసాగిస్తుండటాన్ని అందరూ తప్పు పడుతున్నారు. టర్కీతో ద్వైపాక్షిక సంబంధాలకు కటీఫ్ చెప్పాలని యావత్ భారతీయులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Also Read :Rohit Sharma : రోహిత్ రాజకీయాల్లోకి వస్తున్నారా ? సీఎంతో భేటీ అందుకేనా?
కొత్త అప్‌డేట్ ఇదీ..
ఆపరేషన్ సిందూర్ వేళ భారత్‌పై దాడి కోసం పాకిస్తాన్(Turkey Army In Pak)కు టర్కీ దేశం 400కుపైగా అత్యాధునిక డ్రోన్లను పంపిందట. భారతీయుల ప్రాణాలను తీసేందుకు ఇంతగా అత్యుత్సాహాన్ని కనబరుస్తున్న టర్కీతో ఇంకా స్నేహాన్ని కొనసాగించడం భారత్‌కు మంచిది కాదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సూచిస్తున్నారు. టర్కీతో భారత్ వాణిజ్యాన్ని వెంటనే ఆపేయాలని కోరుతున్నారు. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్తాన్‌లోకి టర్కీ ఆర్మీ కూడా వచ్చిందట. డ్రోన్లను ప్రయోగించే విషయంలో పాకిస్తాన్ సైనికులకు ట్రైనింగ్ ఇచ్చిందట. ఆయా డ్రోన్లతో ముడిపడిన టెక్నికల్ విశేషాలను పాకిస్తాన్ సైనికులకు టర్కీ సైనికులు వివరించారట. దీన్నిబట్టి భారత్‌తో స్నేహాన్ని టర్కీ కోరుకోవడం లేదని స్పష్టమైంది. ఈవిషయం తెలిసిన తర్వాత కూడా భారత్ టర్కీతో వన్ సైడ్ స్నేహం చేయడం సరికాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Floating Houses : భూకంపం వస్తే గాల్లో తేలే ఇళ్లు.. టెక్నాలజీ రెడీ
టర్కీ సైనికులు కూడా చనిపోయారట
గుడ్ న్యూస్ ఏమిటంటే.. పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై భారత్ చేసిన మిస్సైల్, డ్రోన్ దాడుల్లో ఇద్దరు, ముగ్గురు టర్కీ సైనికులు కూడా చనిపోయారట.భారత్‌లో కూలిన పాకిస్తాన్ డ్రోన్లను ఇప్పటికే మన ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. వాటిపై ‘అసిస్ గార్డ్ సోనగర్’ అని రాసి ఉంది. ఆ పేరుతో డ్రోన్లను టర్కీ ఆర్మీ తయారు చేస్తోంది. అజర్ బైజాన్ దేశం కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా ప్రకటన విడుదల చేసింది. ఆ దేశానికి కూడా భారత్ కటీఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది.