Site icon HashtagU Telugu

Superman : ట్రంప్ ‘సూపర్ మ్యాన్’, ఎలాన్ మస్క్‌ ‘సైబోర్గ్‌’.. ఎన్నికల ప్రచారంలో క్రియేటివిటీ

Trump Superman

Superman : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. ఓ వైపు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. ట్రంప్ అండ్ టీమ్ తనదైన శైలిలో క్రియేటివిటీతో ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నాారు. అమెరికా ఓటర్లకు చేరువయ్యేందుకు సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో వాడుకుంటోంది. ట్రంప్‌కు ట్రూత్ సోషల్ పేరుతో సొంత సోషల్ మీడియా కంపెనీ ఉంది.

We’re now on WhatsApp. Click to Join

తాజాగా ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను  పోస్ట్ చేశారు. ఆ పోస్టర్‌లో ‘సేవ్ అమెరికా’ అనే నినాదం ఉంది. దానిపై ట్రంప్‌ను సూపర్ మ్యాన్‌లా చూపించారు. ఇక రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్‌ను బ్యాట్ మ్యాన్‌గా చూపించారు. ఎలాన్ మస్క్‌ను సైబోర్గ్‌గా, వివేక్ రామస్వామిని ది ఫ్లాష్‌గా, రాబర్ట్ ఎఫ్ కెనడీని జూనియర్ ఆక్వామ్యాన్‌గా, తులసీ గబార్డ్‌ను సూపర్ ఉమెన్‌గా చూపించారు. మొత్తం మీద రిపబ్లికన్ పార్టీ కీలక నేతలందరినీ సూపర్ హీరోలుగా ఈ పోస్టరులో చూపించారు. వీళ్లంతా కలిసి అమెరికాను సేవ్ చేయబోతున్నారు అనే సందేశాన్ని దీని ద్వారా ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేశారు. ‘ట్రంప్‌ 2024’ అని క్యాప్షన్‌ రాసి ఉన్న ఈ పోస్టర్ అమెరికాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎంతో క్రియేటివ్‌గా తయారు చేయడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం మీద రిపబ్లికన్ పార్టీ ప్రచారం టీమ్ పనితీరు, డెమొక్రటిక్ పార్టీతో పోలిస్తే చాలా బెటర్‌గా ఉందనే అభిప్రాయం అమెరికా రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.

Also Read :Mohanlal : మాలీవుడ్​ను నాశనం చేయొద్దు.. వాళ్లకు శిక్ష తప్పదు: మోహన్ లాల్

సూపర్‌ హీరో సూట్‌లో..

గత వారం ట్రంప్‌ బృందం నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్స్‌-డిజిటల్‌ ట్రేడింగ్‌ కార్డ్స్‌ను కూడా విడుదల చేసింది. ట్రంప్‌ సూపర్‌ హీరో సూట్‌(Superman) ధరించి  డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా వాటిలో ఉండటం విశేషం. కొన్ని చోట్ల బిట్‌కాయిన్లను ట్రంప్ ప్రమోట్‌ చేస్తున్నవి కూడా కనిపిస్తున్నాయి. 2017లో ట్రంప్ కుమారుడు డొనాల్డ్‌ జూనియర్‌ ఇలానే తన తండ్రిని సూపర్‌మ్యాన్‌గా చూపిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ట్రంప్ కూడా స్వయంగా తనను తాను సూపర్‌ మ్యాన్‌గా చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

Also Read :Hydra : బీజేపీ కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా