America Attack : ఇరాన్ మీద అమెరికా వేసిన బాంబు బరువు ఎంతో..ఆ బాంబ్ విశేషాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

America Attack : ఈ దాడుల్లో అమెరికా అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు GBU-57 MOP (Massive Ordnance Penetrator) ప్రయోగించింది. ప్రత్యేకంగా భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు రూపొందించిన ఈ బాంబు బరువు

Published By: HashtagU Telugu Desk
America Attack On Iran

America Attack On Iran

ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా (America) కీలకంగా జోక్యం చేసుకుంది. తాజాగా అమెరికా సైన్యం (US Army) ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ ప్రాంతాల్లో ఉన్న అణు కేంద్రాలే ఈ దాడుల్లో లక్ష్యంగా మారాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా పరిమితమైన అమెరికా, నేరుగా సైనిక దాడుల్లోకి దిగడంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Lifestyle :ప్రతిరోజూ ఎన్ని గ్లాసుల నీటిని తీసుకోవాలి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసా!

ఈ దాడుల్లో అమెరికా అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు GBU-57 MOP (Massive Ordnance Penetrator) ప్రయోగించింది. ప్రత్యేకంగా భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు రూపొందించిన ఈ బాంబు బరువు సుమారు 13,000 కిలోలు, దీని పొడవు 20.5 అడుగులు. ఇది 200 అడుగుల మట్టిని, 60 అడుగుల కాంక్రీటును ఛేదించి లోతైన బంకర్లలో దాగిన లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. బాంబులో ఉన్న పేలుడు పదార్థం కంటే ఎక్కువ భాగం బాంబు కేసింగ్ ద్వారా విధ్వంసం కలిగించేలా రూపొందించారు. ఈ బాంబులను మోయగల బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు.

Lifestyle : మద్యం సేవించడం మానలేకపోతున్నారా? ఈ రూల్స్ పాటిస్తే మద్యానికి దూరంగా ఉండొచ్చు!

ఫోర్డో అణు కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణాన పర్వత ప్రాంతంలో 90 మీటర్ల లోతులో భూగర్భంలో ఉంది. అలాంటి కేంద్రాలపై అమెరికా చేసిన ఈ బంకర్ బస్టర్ దాడులు ఎంత మేరకు నష్టం కలిగించాయన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, అణు ఆయుధాలు అభివృద్ధి చేసే కేంద్రాలపై జరిగిన ఈ దాడులు ఆ ప్రాంతంలోని శాంతిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇరాన్ ఈ దాడులకు ఎలా స్పందిస్తుందన్నదానిపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.

  Last Updated: 22 Jun 2025, 05:09 PM IST