Site icon HashtagU Telugu

Pasola Festival: పచ్చని పొలాల్లో పసోలా పండుగ.. పెద్ద యుద్ధమే!!

Indonesian Island Sumba Pasola Festival Soil Fertility Human Blood Min

Pasola Festival: పసోలా పండుగ వేడుక వచ్చిందంటే .. పెద్ద యుద్ధం జరిగినట్టే. అది కూడా పచ్చటి పొలాల్లో. యువకులంతా ఈటెలు చేతపట్టి,  గుర్రాలపై స్వారీ చేస్తూ పొలంలో రక్తం చిందేదాకా పరస్పరం తలపడతారు. కనీసం ఎవరిదైనా ఒకరి రక్తం చిందిన వెంటనే ఈ విచిత్ర వేడుక ఆగిపోతుంది. పంటసాగు కాలం ప్రారంభాన్ని పురస్కరించుకొని  ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పసోలా పండుగను జరుపుకుంటారు. వివరాలివీ..

Also Read :Immunity For One Murder: ఒక్క హత్యకైనా మహిళలను అనుమతించాలి.. రాష్ట్రపతికి సంచలన లేఖ

సుంబా ప్రజలు

మన దేశంలోనూ పలు సంప్రదాయ వేడుకలు రక్తం చిందేలా జరుగుతుంటాయి. ఇండోనేషియా(Pasola Festival) దేశం ఇందుకు అతీతమేం కాదు. అక్కడ కూడా చాలా ప్రాచీన తెగల ప్రజలు ఉన్నారు. వారంతా తమ పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటిస్తుంటారు. ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవి ప్రజలు ఈ కోవలోకే వస్తారు. వారంతా జరుపుకునే విచిత్ర పండుగే మనం చెప్పుకున్న ‘పసోలా’.

Also Read :Telangana Congress: ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ సమన్వయ కమిటీ

పసోలా వేడుక ఇలా..