Site icon HashtagU Telugu

Sudan War Effect: యుద్ధం ఎఫెక్ట్.. బొగ్గు, ఆకులు తింటున్న జనం

Sudan War Effect Sudanese People Charcoal Leaves

Sudan War Effect: ఆఫ్రికా దేశం సూడాన్‌లో యుద్ధం తర్వాత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, నిత్యావసరాలు ప్రజలకు దొరకడం లేదు. దీంతో వారు బొగ్గులు, ఆకులు తిని బతకాల్సి వస్తోంది. తాగేందుకు నీళ్లు దొరకక.. దాహంతో కేకలు వేస్తూ ఎంతోమంది చనిపోతున్నారు. ఇలా ప్రాణాలు కోల్పోతున్న వారిలో చిన్నారులు కూడా ఉండటం విషాదకరం.

Also Read :Electric Road : ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ రోడ్డు.. ఎలా పనిచేస్తుంది ?

శరణార్ధుల క్యాంపుపై ఉగ్రదాడి తర్వాత.. 

సూడాన్‌లోని ఎల్ ఫాషర్ సిటీకి(Sudan War Effect) సమీపంలో ఉన్న శరణార్ధుల క్యాంపుపై తాజాగా ఉగ్రదాడి జరిగింది. దీంతో అందులో ఉన్న ప్రజలంతా చెల్లాచెదురుగా పరుగులు తీశారు. వాళ్లంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని.. తవిలా అనే పట్టణం వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే మార్గం మధ్యలో ఎడారి ప్రాంతం ఉంది. దీంతో నిలువ నీడ కోల్పోయిన  శరణార్ధులు  అందరూ తవిలా పట్టణానికి చేరుకునే పరిస్థితి లేదు. మండుటెండల్లో ఎడారి మీదుగా నడుస్తూ..  దాహం కేకలు వేస్తూ ఇప్పటికే పలువురు శరణార్ధులు చనిపోయారు. ఎల్ ఫాషర్ సిటీ, తవిలా పట్టణం  మధ్య రోడ్డుపై పెద్దసంఖ్యలో డెడ్‌బాడీలు పడి ఉన్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read :KTR Vs Kavitha: కేటీఆర్, కవిత మధ్య కోల్డ్‌వార్.. ఈ ప్రచారంలో నిజమెంత?

ఎల్ ఫాషర్ సిటీలో ఎందుకీ రగడ

ఎల్ ఫాషర్ సిటీ విషయానికొస్తే.. ఇది సూడాన్ పశ్చిమ ప్రాంతమైన డార్ఫర్‌లోని చివరి నగరం. ఈ సిటీ ప్రస్తుతం సూడాన్ సైన్యం ఆధీనంలో ఉంది. అయితే ఎల్ ఫాషర్ సిటీపై పట్టు కోసం పారా మిలిటరీకి చెందిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ యత్నిస్తున్నాయి. ఈక్రమంలోనే ఎల్ ఫాషర్ సిటీలోని శరణార్ధి శిబిరాలపై దాడులకు తెగబడుతున్నాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ రెండేళ్లుగా సూడాన్ సైన్యంతో పోరాడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు లక్షన్నర మంది చనిపోయారు. కోటి 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభమని సహాయక సంస్థలు అంటున్నాయి.