Wikipedia Vs Elon Musk : వికీపీడియా.. ఇంటర్నెట్ ‘ఎన్‌సైక్లోపీడియా’ వెబ్‌సైట్‌గా మంచిపేరు సంపాదించింది. ఎన్నో దేశాలకు చెందిన కోట్లాది మంది నిత్యం దీన్ని వినియోగిస్తుంటారు. మొదటి నుంచీ వికీపీడియా విధానాలను వ్యతిరేకిస్తున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. వికీపీడియా.. వామపక్ష భావజాల కథనాలను నడుపుతోందని ఆయన ఆరోపించారు.
Also Read :Lawrence Bishnoi : జైలులో నుంచి లారెన్స్ బిష్ణోయి ఇంటర్వ్యూలు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్
వామపక్ష శక్తులకు అనుకూలంగా సమాచారాన్ని పొందుపర్చేందుకు వికీపీడియా కసరత్తు చేస్తోందని మస్క్ పేర్కొన్నారు. సీక్రెట్ ఎజెండాతో పనిచేస్తున్న వికీపీడియాకు విరాళాలు ఇవ్వడాన్ని ఆపేయాలని ప్రజలను ఆయన కోరారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ ఒక పోస్ట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్, ఇస్లామిక్ గ్రూపుల మధ్య ఇప్పుడు భీకర యుద్ధం(Wikipedia Vs Elon Musk) జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇస్లామిక్ గ్రూపులను సానుకూల కోణంలో నెటిజన్లకు చూపించడానికి వికీపీడియా యత్నిస్తోంది. దాదాపు 40 మంది వికీపీడియా ఎడిటర్ల టీమ్ ఇందుకోసం పనిచేస్తోంది. 2023 సంవత్సరం అక్టోబరు 7 ఘటనలను స్వార్థపూరిత కోణంలో వికీపీడియా చూపిస్తోంది’’ అని మస్క్ వ్యాఖ్యానించారు.
Also Read :MS Dhoni : జార్ఖండ్ అసెంబ్లీ పోల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
వికీపీడియాపై తాజా ఆరోపణలు ఇవీ..
- 2023 సంవత్సరం అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఉగ్రదాడికి పాల్పడింది. అయితే దీనికి సంబంధించిన వికీపీడియా పేజీ నుంచి హమాస్ పేరును ఇటీవలే తొలగించారని ‘పైరేట్ వైర్స్’ ఒక నివేదికను విడుదల చేసింది.
- ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత జరిగిన దురాగతాల వివరాలను వికీపీడియా నుంచి తొలగించారని అమెరికాకు చెందిన ఒక న్యూస్ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.
- ఇక భారతదేశంలో వికీపీడియాను సూపర్ ఎడిటర్లు దుర్వినియోగం చేస్తున్నారనే టాక్ ఉంది. తమకు నచ్చిన రీతిలో విషయాలను ప్రజెంట్ చేయడానికి ఈ సూపర్ ఎడిటర్ల ప్రయత్నిస్తారనే ప్రచారం జరుగుతోంది.