Iran Attack : ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. డ్రోన్లు, మిస్సైళ్లతో అర్ధరాత్రి ఎటాక్

Iran Attack : ఎట్టకేలకు ఇజ్రాయెల్‌పై శనివారం అర్ధరాత్రి ఇరాన్ ప్రతీకార దాడి చేసింది.

  • Written By:
  • Updated On - April 14, 2024 / 09:05 AM IST

Iran Attack : ఎట్టకేలకు ఇజ్రాయెల్‌పై శనివారం అర్ధరాత్రి ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. డ్రోన్లు, మిస్సైళ్లను ఇజ్రాయెల్‌లోని మిలిటరీ స్థావరాలపైకి సంధించింది. దీంతో యావత్ ఇజ్రాయెల్ హైఅలర్ట్‌ను అమలు చేశారు. చాలా మంది ప్రజలు భూగర్భ షెల్టర్‌లలో తలదాచుకున్నారు.  క్షిపణులు, డ్రోన్ల రాకను సూచిస్తూ  ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాల్లో సైరన్లు కంటిన్యూగా మోగాయి. వందలాది క్రూయిజ్ మిస్సైళ్లు, 200 కంటే ఎక్కువ సూసైడ్ డ్రోన్లను ఇరాన్ ఆర్మీ తమ దేశంపైకి ప్రయోగించిందని  ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతినిధి డేనియల్ హగారి వెల్లడించారు. ఈ దాడిలో(Iran Attack) ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. 7 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

దాదాపు 10 ఇరానీ క్షిపణులను, పదుల సంఖ్యలో సూసైడ్ డ్రోన్లను తాము బార్డర్‌లోనే అడ్డుకొని కూల్చేశామని తెలిపారు. ఇరాన్ చేసిన ఈ దాడులకు యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లు కూడా సహకరించారని, వారు యెమన్ భూభాగం నుంచి డ్రోన్లను ఇజ్రాయెల్‌పైకి పంపారని గుర్తించారు. ఈ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు టెల్ అవీవ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంలో వార్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. తదుపరిగా ఎలా స్పందించాలి అనేది నిర్ణయించారు. ఇజ్రాయెల్ కూడా త్వరలోనే ఇరాన్‌పై నేరుగా ప్రతిదాడికి దిగొచ్చంటూ ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఐక్యరాజ్యసమితికి ఇరాన్ మిషన్ వెంటనే స్పందిస్తూ.. ‘‘ఇజ్రాయెల్ మరో తప్పు చేస్తే.. ఇరాన్ ప్రతిస్పందన ఇంకా తీవ్రంగా ఉంటుంది’’ అని బదులిచ్చింది. రెండు దేశాల మధ్య నడుస్తున్న ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.  ‘‘మేం ప్రతీకార దాడి చేశాం. విషయం ఇంతటితో ముగిసింది’’ అని ఇరాన్ కామెంట్ చేసింది.

Also Read : Skipping Breakfast: మీరు ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా..? అయితే డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్లే..!

సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు చనిపోయారు. మరో ఐదుగురు ఇరానీ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు.  దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాాతావరణం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పరిస్థితుల్లోనైనా ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని బలంగా చెబుతున్న అమెరికా.. ఇరాన్ జరిపిన ప్రత్యక్ష దాడిపై ఎలా ప్రతిస్పందిస్తుందో వేచిచూడాలి.

Also Read :Screen Time: మీ పిల్లలు అతిగా ఫోన్ వాడుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో ఫోన్‌కు దూరం చేయండిలా..!