Site icon HashtagU Telugu

Russia Vs Google : గూగుల్‌పై కట్టలేనంత భారీ జరిమానా.. రష్యా సంచలన నిర్ణయం

Russian Court Fined Google Decillion Dollars

Russia Vs Google : అమెరికాకు చెందిన సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు రష్యా కోర్టు షాక్ ఇచ్చింది.  రష్యాకు చెందిన 17 ప్రభుత్వ అనుకూల యూట్యూబ్ ఛానళ్లపై 2020 సంవత్సరం నుంచి గూగుల్ బ్యాన్‌ను అమలు చేస్తోంది. ఈ నిషేధాన్ని తొలగించాలని గతంలో మాస్కో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా గూగుల్ బేఖాతరు చేసింది. దీంతో గూగుల్ కంపెనీ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లుగా పరిగణించిన మాస్కో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గూగుల్‌పై(Russia Vs Google)  2.5 డెసిలియన్ అమెరికా డాలర్ల భారీ జరిమానాను విధించింది.

Also Read :Raghunandan Rao: ఇందిరమ్మ కమిటీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం : రఘునందన్ రావు

డెసిలియన్ డాలర్లు అంటే చాలా పెద్దమొత్తం. 1 బిలియన్ డాలర్లు అంటే.. రూ.8500 కోట్లు. 10 బిలియన్ డాలర్లు అంటే.. రూ.85వేల కోట్లు. 10 బిలియన్ డాలర్ల అమౌంటును 24 రెట్లు పెంచితే ఎంత అవుతుందో అంత మొత్తాన్ని జరిమానాగా చెల్లించాలని గూగుల్‌ను మాస్కో కోర్టు ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో చలామణిలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ అమౌంటును గూగుల్‌పై జరిమానాగా విధించడం గమనార్హం. ప్రస్తుతం యావత్ ప్రపంచ దేశాల జీడీపీ 100 ట్రిలియన్ డాలర్లు కంటే ఎక్కువగా ఉంది. 1 ట్రిలియన్ డాలర్లు అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు. గూగుల్ పేరెంట్ కంపెనీ పేరు ఆల్ఫా బెట్. ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 2 లక్షల కోట్ల రూపాయలు. ఈ నేపథ్యంలో రష్యా కోర్టు విధించిన పైన్‌ను గూగుల్ కట్టడం అసాధ్యం.

Also Read :Maoist Party : ప్రజలకు ఆ డబ్బు తిరిగివ్వకుంటే శిక్ష తప్పదు.. మావోయిస్టుల సంచలన లేఖ

గూగుల్ బ్లాక్ చేసిన రష్యన్ యూట్యూబ్ ఛానళ్ల జాబితాలో.. త్సాగరడ్ టీవీ, రియా ఫ్యాన్, స్పుత్నిక్, ఎన్టీవీ, రష్యా 24, ఆర్టీ, ఛానల్ వన్, జ్వెజ్డా వంటి ప్రముఖ ఛానల్స్ ఉన్నాయి. తమ కంపెనీ కంటెంట్ పాలసీని ఉల్లంఘించాయనే కారణంతో వీటిపై బ్యాన్ విధించామని గూగుల్ వాదిస్తోంది. రష్యా  కోర్టు తీర్పుల గురించి గూగుల్ ముందే ఒక అంచనాకు వచ్చింది. ఇందులో భాగంగా రష్యన్ యూట్యూబ్ ఛానళ్ల యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కోర్టులలో ముందస్తుగా లీగల్ పిటిషన్లు దాఖలు చేసింది.