Site icon HashtagU Telugu

Russia Vs Ukraine : అణ్వస్త్ర భయాలు.. ఖండాంతర క్షిపణితో ఉక్రెయిన్‌పై రష్యా ఎటాక్

Russia Inter Continental Ballistic Missile On Ukraine Kyiv

Russia Vs Ukraine : రష్యా ఆగ్రహంతో ఊగిపోయింది. తమ దేశంపైకి ఆరు లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించిన ఉక్రెయిన్‌పై ఏకంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)తో దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని డెనిపర్‌ నగరంపై రష్యాకు చెందిన ఐసీబీఎం మిస్సైల్ పడి భారీ విధ్వంసం జరిగింది. పేలుడు శబ్దాల తీవ్రత అత్యధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారు ? ఆస్తి నష్టం ఎంతమేర జరిగింది ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా ప్రయోగించిన ఐసీబీఎం మిస్సైల్ ప్రత్యేకత ఏమిటంటే.. న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లే కెపాసిటీ కూడా దానికి ఉంది. ఐసీబీఎం మిస్సైల్‌తో పాటు ఎక్స్‌-47ఎం2 కింజల్‌ బాలిస్టిక్‌ క్షిపణిని కూడా ఉక్రెయిన్‌పైకి రష్యా ప్రయోగించింది. ఈవివరాలను ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. ఈ దాడిపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. ఇలాంటి అంశాలపై చెప్పేందుకు ఏమీ ఉండదని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌(Russia Vs Ukraine) స్పష్టం చేశారు. రష్యా  సైనికులను ఈ ప్రశ్న అడగాలని ఆయన మీడియాకు సూచించారు.  ఇవాళ ఉక్రెయిన్‌పై ఐసీబీఎం మిస్సైళ్లతో రష్యా దాడి చేయనుందనే సమాచారం నిఘా వర్గాల ద్వారా అమెరికాకు ముందే అందినట్లు తెలుస్తోంది. అందుకే బుధవారం రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తమ ఎంబసీని అమెరికా ఖాళీ చేసింది.

Also Read :MLC Kavitha : ‘‘అదానీకొక న్యాయం.. ఆడబిడ్డకొక న్యాయమా ?’’.. ప్రధాని మోడీకి కవిత ప్రశ్న

Also Read :World Television Day 2024: తిరుగులేని ‘ఠీవీ’.. విజువల్ మీడియాలో రారాజు