Toilet Battle : సారా మెక్‌బ్రైడ్.. ఈమె ఒక ట్రాన్స్‌జెండర్. ఇటీవలే ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీచేసి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డును సొంతం చేసుకున్నారు. జనవరిలో ఆమె అమెరికా కాంగ్రెస్ భవనంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఆమెకు ఆటంకాలు క్రియేట్ చేసేందుకు పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మహిళా సభ్యులు ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. సారా మెక్‌బ్రైడ్‌ను అమెరికా కాంగ్రెస్ భవనంలోని మహిళల బాత్‌రూమ్‌లోకి(Toilet Battle) రానివ్వకూడదని తీర్మానించుకున్నారు. దక్షిణ కరోలినా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన రిపబ్లికన్ నాయకురాలు నాన్సీ మేస్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
Also Read :Rice Millers : సర్కారుకు రూ.605 కోట్లు బకాయిపడ్డ 10 మంది మిల్లర్లు
ఈ ప్రతిపాదనను ఇటీవలే అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ సమర్పించారు. దాన్ని ఆయన కూడా సమర్థించారని తెలుస్తోంది. పురుషులను స్త్రీల బాత్‌రూమ్‌లలోకి అనుమతించేది లేదని జాన్సన్ స్పష్టం చేశారట. తనకు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ మహిళా నేతలు చేసిన తీర్మానాన్ని సారా మెక్‌బ్రైడ్ ఖండించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించడానికే ఇలాంటి అంశాలను పెద్దవిగా చేసి చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. డెలావర్ రాష్ట్రంలోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సారా మెక్‌బ్రైడ్ గెలిచారు. జనవరిలో ఆమె అమెరికా కాంగ్రెస్ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read :AR Rahman Divorce : భార్య సైరాకు విడాకులు.. ఏఆర్ రెహమాన్ ఎమోషనల్ మెసేజ్
ట్రాన్స్‌జెండర్ల బాత్‌రూమ్‌ల విషయంలో అమెరికాలో గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. పబ్లిక్ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల బాత్‌రూమ్‌లను ట్రాన్స్‌జెండర కేటగిరీకి చెందినవారు వాడకుండా 11 అమెరికా రాష్ట్రాలు చట్టాలను అమలు చేస్తున్నాయి. భారతదేశంలోనూ ట్రాన్స్‌జెండర్ల కారణంగా మహిళల టాయిలెట్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో మన దేశంలోనూ ఈ అంశంపై మహిళా సంఘాలు గళమెత్తే అవకాశాలు లేకపోలేదు.