Polar Bear : ధ్రువపు ఎలుగుబంటు అనేది అరుదైన జంతువు. దాన్ని దారుణంగా కాల్చి చంపారు. కాల్చి చంపింది మరెవరో కాదు పోలీసులే. ఐస్‌లాండ్ దేశంలోని ఒక మారుమూల గ్రామంలోని కాటేజీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈవివరాలు ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆ ధ్రువపు ఎలుగుబంటి(Polar Bear) నుంచి స్థానికులకు ముప్పు పొంచి ఉందని భావించి కాల్చామని పోలీసులు వాదిస్తున్నారు. దాన్ని అక్కడి నుంచి వేరే చోటుకు తరిమేందుకు యత్నించామని, అయితే అది సాధ్యపడకపోవడంతో కాల్చామని అంటున్నారు.
Also Read :Lebanon Pager Blasts : లెబనాన్‌లో పేజర్లు పేలిన కేసులో కేరళవాసి పేరు.. ఏం చేశాడంటే.. ?
‘‘ఆ ఎలుగుబంటు ఉన్న ప్రదేశానికి సమీపంలోనే ఒక ఇల్లు ఉంది. అందులో ఒక ముసలావిడ ఉంది. ఒకవేళ ఎలుగుబంటు అటువైపుగా వెళితే ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అందుకే దానిపై కాల్పులు జరిపాం’’ అని పోలీసులు తెలిపారు. ‘‘ఆ ముసలావిడ ఇంట్లో ఒంటరిగా ఉంది. ధ్రువపు ఎలుగుబంటిని చూసి ఆమె భయపడి పోయింది. తనను తాను రక్షించుకునేందుకు మేడపైకి వెళ్లింది. వెంటనే ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్‌లోని తన కుమార్తెకు ఫోన్ చేసింది. ఆమె కుమార్తె నుంచి మాకు సమాచారం వచ్చింది. మేం వెళ్లి ఆమెను రక్షించాం’’ అని పోలీసులు వివరించారు. కాగా, 2016 తర్వాత ఐస్‌లాండ్ దేశంలో కనిపించిన మొదటి ధ్రువపు ఎలుగుబంటు ఇదే.
Also Read :Sitaram Yechury : సీతారాం ఏచూరిని రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించేవారు : సీఎం రేవంత్
2017లో వైల్డ్‌లైఫ్ సొసైటీ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రపు మంచు క్రమంగా కరిగిపోతోంది. దీని వల్ల ఎక్కువ ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనవాసాల్లోకి వస్తున్నాయి. కెనడా, గ్రీన్‌ల్యాండ్, నార్వే, రష్యా, యునైటెడ్ స్టేట్స్‌లలో 1870 నుంచి 2014 వరకు ధ్రువ ఎలుగుబంట్లు పెద్దసంఖ్యలోనే దాడులు చేశాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు, జంతు పరిరక్షణ విభాగాలు అప్పుడప్పుడు కాల్పులు జరపాల్సి వస్తోంది.