Obamas Favourite Film : 2024 సంవత్సరంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నచ్చిన సినిమా ఏదో తెలుసా ? మన భారతీయ సినిమానే ఆయన లైక్ చేశారు. ఈ ఏడాది తనకు బాగా నచ్చిన సినిమాల లిస్టును ఆయన స్వయంగా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఆ జాబితా ప్రకారం.. ఈ సంవత్సరం ఒబామా మది దోచిన మూవీల్లో నంబర్ 1 స్థానంలో ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ ఉంది. ఈ సినిమాకు పాయల్ కపాడియా డైరెక్టర్‌గా వ్యవహరించారు. దీంతో ఈ మూవీపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఒబామాను అంతగా ఆకట్టుకున్న ఆ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకునేందుకు చాలామంది నెటిజన్లు మొగ్గుచూపుతున్నారు. ముంబైలోని ఒక నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథతో ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’(Obamas Favourite Film) మూవీని తీశారు. ఈ సినిమాలో కనికుశ్రుతి, దివ్య ప్రభ, చాయాకదం తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Also Read :Alappuzha Express : అలప్పుళ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికుల పరుగులు
‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాను ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించారు. దీనికి ‘గ్రాండ్ పిక్స్’ అవార్డు సైతం లభించింది. మన భారతీయ సినిమాకు ఈ అవార్డు రావడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతేకాదు 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు కూడా ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమా నామినేట్ అయింది. దీంతోపాటు బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో సైతం ఈ సినిమా నామినేషన్లను కైవసం చేసుకుంది. ఈ గుర్తింపులన్నీ దక్కడం వల్లే ఈ సినిమాపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆసక్తి కలిగింది. చివరకు ఆయన ఈసినిమాను చూశారు. స్టోరీతో బాగా ప్రభావితులయ్యారు. సాధారణ నర్సుల జీవితగాథలను, వాస్తవిక జన జీవితాలను అద్దంపట్టేలా చిత్రీకరించడం ఒబామాకు బాగా నచ్చింది. ఈ సినిమాను నటుడు రానా తెలుగులో విడుదల చేశారు.
Also Read :Nigerian Gangs : స్టూడెంట్స్, ఉద్యోగుల ముసుగులో డ్రగ్స్ దందా.. వాళ్లకు చెక్
- 2024 సంవత్సరంలో ఒబామాకు నచ్చిన ఇతర సినిమాల జాబితాలో కాన్‌క్లేవ్, ది పియానో లెసెన్, ది ప్రామిస్డ్ ల్యాండ్, ది సీడ్ ఆఫ్ ది సెక్రెడ్ ఫిగ్, డ్యూన్: పార్ట్ 2, అనోరా, దీదీ, షుగర్‌కేన్, ఎ కంప్లీట్ అన్‌నోన్ వంటివి ఉన్నాయి.
- 2024లో ఒబామా మనసు గెల్చుకున్న మ్యూజిక్ ఆల్బమ్స్ జాబితాలో.. లంచ్, యాయో, జంప్, ఫేవరెట్, యాక్టివ్, గోల్డ్ కోస్ట్ వంటివి ఉన్నాయి.
- ఈ సంవత్సరం ఒబామాకు నచ్చిన రచనల జాబితాలో.. ‘ది యాంగ్జియస్ జనరేషన్’, ‘స్టోలెన్ ప్రైడ్’, ‘గ్రోత్’, ‘ఆర్బిటల్’, ‘ది వర్క్ ఆఫ్ ఆర్ట్’ వంటివి ఉన్నాయి. ఇతరులు కూడా వాటిని చదవాలని ఆయన రికమెండ్ చేశారు.