Terror Attack Plot : గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ ఉగ్రవాదులు చొరబడి దాడికి పాల్పడ్డారు. ఎంతోమంది ఇజ్రాయెలీ పౌరులను కిడ్నాప్ చేసి బందీలుగా గాజా ప్రాంతంలోకి తీసుకెళ్లిపోయారు. మళ్లీ ఈసారి అక్టోబరు 7న ఇదే తరహా ఉగ్రదాడిని అమెరికాలోని న్యూయార్క్ నగరంపై చేయాలని పాకిస్తానీ పౌరుడు ముహమ్మద్ షాజెబ్ ఖాన్ కుట్రపన్నాడు. ఈక్రమంలో అతడికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ అల్-షామ్ (ఐఎస్ఐఎస్)కి సహాయం చేసింది. దీనిపై అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఆ సమాచారం అమెరికా నుంచి కెనడా నిఘా వర్గాలకు చేరింది. దీంతోో సదరు పాకిస్తానీ వ్యక్తిని(Terror Attack Plot) కెనడాలో అరెస్టు చేశారు.
Also Read : Brij Bhushans First Reaction : వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా : బ్రిజ్ భూషణ్
న్యూయార్క్ నగరంలో యూదుల జనాభా చాలా ఎక్కువ. యూదులను ఇంగ్లిష్‌లో జ్యూస్ అంటారు. న్యూయార్క్ నగరాన్ని కొందరు జ్యూ యార్క్‌గా పిలుస్తుంటారు. ఈ నగరంలో పెద్దపెద్ద వ్యాపారులంతా యూదు వర్గానికి చెందినవారే. ఇక్కడ యూదులకు సంబంధించిన ఎన్నో స్కూళ్లు ఉన్నాయి. వారి మతపరమైన శిక్షణా కేంద్రాలు కూడా న్యూయార్క్‌లో ఉన్నాయి. అందుకే పాకిస్తానీ పౌరుడు ముహమ్మద్ షాజెబ్ ఖాన్ న్యూయార్క్ సిటీపై వచ్చే నెల 7న దాడి చేసేందుకు కుట్ర చేశాడని గుర్తించారు. అక్కడున్న యూదుల ప్రార్థనా స్థలాలపై దాడి చేయాలని అతడు భావించాడని సమాచారం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే కూడా ఈవివరాలను ధ్రువీకరించారు. అమెరికా, దాని మిత్రదేశాల గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై విచారించిన ఎఫ్‌బీఐ.. ముహమ్మద్ షాజెబ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఐసిస్‌కు మద్దతుగా పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. 2023 నవంబరు నాటికి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్‌లో అతడు ఇతరులతో కమ్యూనికేట్ చేశాడని దర్యాప్తులో తేలింది.