Site icon HashtagU Telugu

Train Hijack : పాక్‌లో రైలు హైజాక్.. వేర్పాటువాదుల అదుపులో వందలాది మంది

Pakistan Train Hijack Jaffar Express Baloch Liberation Army

Train Hijack : ఉగ్రవాదుల నిలయంగా మారిన పాకిస్తాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.  బెలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో ఉన్న పెషావర్‌కు వెళ్తున్న  జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బెలూచిస్తాన్‌ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. మార్గం మధ్యలో ఉన్న ఒక రైల్వేట్రాక్‌ను వారు తొలుత పేల్చేశారు. దీన్ని గమనించి కొంత దూరంలో రైలును ఆపగానే, దానిలోకి చొరబడి హైజాక్  చేశారు. ఈక్రమంలో రైలులో భారీ కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన వారిపై దాడికి  పాల్పడ్డారు. వందలాది మంది ప్రయాణికులు ఉన్న బోగీలను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు.

Also Read :Hindu Mutton Shops: హిందువుల మటన్ షాపులకు ‘మల్హర్ సర్టిఫికేషన్’‌.. ఏమిటిది ?

మాదే బాధ్యత : బెలూచ్ లిబరేషన్ ఆర్మీ 

ఈ హైజాక్‌కు బాధ్యత తమదేనని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. తాము బందీలుగా తీసుకున్నవారిలో పాకిస్తాన్ భద్రతాసిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. తమ కాల్పుల్లో ఆరుగురు పాక్ మిలిటరీ సిబ్బంది చనిపోయారని బీఎల్‌ఏ వెల్లడించింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తే, ప్రయాణికులందరినీ చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ గాయపడినట్లు సమాచారం. అత్యవసర చర్యలు తీసుకోవాలంటూ స్థానిక అధికార యంత్రాంగాన్ని బెలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వం ఆదేశించింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాయి.

Also Read :Dalai Lama Vs China: భారత్‌లో నా వారసుడు.. దలైలామా ప్రకటన.. చైనా భగ్గు

ఏమిటీ బెలూచిస్తాన్ వేర్పాటువాదం ?