ఆపరేషన్ అబ్సల్యూట్-రిజాల్వ్.. మదురో అరెస్ట్ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

అమెరికా సైన్యాన్ని చూడగానే మదురో దంపతులు ఒక సేఫ్ హౌస్‌లోకి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ డెల్టా ఫోర్స్ కేవలం 5 నిమిషాల్లోనే వారిని బంధించింది.

Published By: HashtagU Telugu Desk
Operation Absolute Resolve

Operation Absolute Resolve

Operation Absolute Resolve: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడానికి అమెరికా చేపట్టిన అత్యంత రహస్య సైనిక చర్య వివరాలు బయటపడ్డాయి. ‘ఆపరేషన్ అబ్సల్యూట్-రిజాల్వ్’ పేరుతో సాగిన ఈ మిషన్ శుక్రవారం రాత్రి మొదలై శనివారం తెల్లవారుజామున పూర్తయింది. ఇందులో అమెరికా సైన్యం, డెల్టా ఫోర్స్, CIA, నేవీ, FBI సంయుక్తంగా పాల్గొన్నాయి.

ఆపరేషన్ సాగిందిలా

మెరుపు దాడులు

శుక్రవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయంలో అమెరికా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ముందుగా వెనిజులాలోని ప్రధాన ప్రాంతాలపై వైమానిక దాడులు చేసి, వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దీనివల్ల డెల్టా ఫోర్స్ హెలికాప్టర్లు ఎటువంటి అడ్డంకులు లేకుండా మదురో ఉన్న చోటుకు చేరుకోగలిగాయి.

ప్రధాన కేంద్రం

కారకాస్‌లోని అతిపెద్ద మిలిటరీ బేస్ అయిన ‘ఫ్యూర్టే టియునా’ను లక్ష్యంగా చేసుకున్నారు. మదురో అక్కడే ఉన్నారని CIA నిఘా వర్గాలు ధృవీకరించడంతో స్పెషల్ ఫోర్స్ ఆ ప్రాంతంలోకి ప్రవేశించి ఆయనను అదుపులోకి తీసుకున్నాయి.

2 గంటల 28 నిమిషాల్లో ముగిసిన మిషన్

తెల్లవారుజామున 2:01 గంటలకు డెల్టా ఫోర్స్ మదురో స్థావరాన్ని చేరుకోగా కేవలం 2 గంటల 28 నిమిషాల్లోనే ఆయనను అక్కడి నుండి తరలించి సముద్ర తీరానికి చేరుకున్నారు. 4:29 గంటలకు ఆపరేషన్ ముగించుకుని వారు అక్కడి నుండి నిష్క్రమించారు.

Also Read: పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్‌.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!

దేశం వెలుపలికి తరలింపు

మదురోను వెనిజులా తీరానికి 100 మైళ్ల దూరంలో సిద్ధంగా ఉన్న USS Iwo Jima యుద్ధనౌకలోకి చేర్చారు. అక్కడి నుండి మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను గ్వాంటానామో బేకు తరలించారు. అనంతరం FBIకి చెందిన ప్రత్యేక విమానంలో వారిని న్యూయార్క్ తీసుకెళ్లారు. ప్రస్తుతం వారిని బ్రూక్లిన్ డిటెన్షన్ సెంటర్‌కు షిఫ్ట్ చేశారు.

CIA వ్యూహం

అంతర్గత నెట్‌వర్క్

మదురో సన్నిహితుల మధ్యే CIA తన ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకుంది. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారు? ఎవరిని కలుస్తారు? ఎక్కడ నిద్రిస్తారు వంటి ప్రతి విషయాన్ని ‘స్టెల్త్ డ్రోన్ల’ సహాయంతో పర్యవేక్షించారు. CIA ఉన్నతాధికారులు ఆగస్టు నెల నుంచే వెనిజులాలో ఉండి మదురో కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.

అమెరికా సైన్యాన్ని చూడగానే మదురో దంపతులు ఒక సేఫ్ హౌస్‌లోకి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ డెల్టా ఫోర్స్ కేవలం 5 నిమిషాల్లోనే వారిని బంధించింది. ఈ ఆపరేషన్ జరుగుతున్నంత సేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నుండి ‘లైవ్ ఫీడ్’ ద్వారా పర్యవేక్షించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి, CIA డైరెక్టర్ కూడా ఉన్నారు.

  Last Updated: 04 Jan 2026, 03:19 PM IST