Brazil : బ్రెజిల్ రాజధాని బ్రసీలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏకంగా ఆ దేశ సుప్రీంకోర్టు వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. వెంటనే అప్రమత్తమైన సుప్రీంకోర్టు భద్రతా దళాలు.. కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని బయటికి పంపించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోర్టు సమయం ముగిసిన వెంటనే ఈ పేలుళ్లు జరిగాయని భద్రతా వర్గాలు గుర్తించాయి.
Also Read : Meenaakshi Chaudhary : సంవత్సరంలో ఆరు సినిమాలు.. నెల గ్యాప్ లో మూడు సినిమాలు.. దూసుకుపోతున్న మీనాక్షి..
అయితే పేలుళ్లలో చనిపోయిన వ్యక్తి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. పేలుడు ఎలా జరిగింది ? దీని వెనుక ఎవరు ఉన్నారు ? దాడి ఎందుకు చేశారు ? అనే అంశాలను తెలుసుకునే దిశగా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే బ్రెజిల్(Brazil) అధ్యక్షుడు లులా డిసిల్వా అధికారిక నివాస భవనం కూడా ఉంది. పేలుడు జరిగిన టైంలో అధ్యక్ష భవనంలో ఆయన లేరని.. పేలుడు సంభవించిన సమయానికి కొన్ని నిమిషాల ముందే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. బ్రెజిల్ పార్లమెంటు భవనం కూడా సంఘటనా స్థలానికి చేరువలోనే ఉంది.
Also Read :Kannappa : ‘కన్నప్ప’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు.. పుష్పకు పోటీగా రావట్లేదు..
ఈ ఘటన జరిగిన తీరు, ఒకరే చనిపోవడాన్ని బట్టి.. ఇదొక సూసైడ్ ఎటాక్ (ఆత్మాహుతి దాడి) అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ‘‘ఓ వ్యక్తి సుప్రీంకోర్టు భవనంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించాడు. అతడిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో అతడు తన వద్దనున్న పేలుడు పదార్థాలను సుప్రీంకోర్టు భవనంపైకి విసిరాడు. ఆ వెంటనే తనను తాను పేల్చుకున్నాడు’’ అని అధికార వర్గాలు చెబుతున్నాయి. భవనం వెలుపల మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ (గురువారం) పార్లమెంటు భవనంలో కార్యకలాపాలను ఆపేశారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
18,19 తేదీల్లో బ్రెజిల్‌లో జీ20 సదస్సు
ఈ ఏడాది జీ20 సదస్సుకు బ్రెజిల్ ఆతిథ్యం ఇస్తోంది. ఈనెల 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో నగరంలో జీ 20 సదస్సు జరుగుతుంది. అంతకంటే రెండు రోజుల ముందు బ్రెజిల్ పర్యటనకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ వస్తున్నారు. ఈనేపథ్యంలో దాడులు జరగడం గమనార్హం. గత సంవత్సరం ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ఓడిపోయారు. దీంతో ఆయన అభిమానులు ప్రభుత్వ భవనాలపై దాడులక తెగబడ్డారు. దీంతో బ్రెజిల్‌లో ఆనాడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.