Pakistan Nuclear Test : పాకిస్తాన్ తొలిసారిగా 1998 మే 28న అణు పరీక్షలు నిర్వహించింది. ఆ అణుపరీక్షలకు ‘ఆపరేషన్ ఛగాయ్ – 1’ అని పాకిస్తాన్ ప్రభుత్వం పేరు పెట్టింది. ఆ అణు పరీక్షలను బెలూచిస్తాన్‌లోని రాస్ కోహ్ హిల్స్ ప్రాంతంలో ఉన్న అండర్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఆనాడు అండర్ గ్రౌండ్‌లో వరుసగా ఐదు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తద్వారా ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన ఏడో దేశంగా పాకిస్తాన్ అవతరించింది. దీన్ని పురస్కరించుకొని పాకిస్తాన్‌లో భారీ ర్యాలీలు జరిగాయి. అక్కడి అధికార, విపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వీటిలో ఉగ్రవాదులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొనడం సంచలన అంశంగా మారింది. ఆ ఉగ్రవాదుల ప్రసంగాలను పాకిస్తాన్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పాకిస్తాన్ రాజకీయ పార్టీల నేతలు ఆ ఉగ్రవాదుల వెంటే ఉండటం కలకలం రేపింది. దీన్నిబట్టి పాక్ ఉగ్రవాదులకు ఉన్న పొలిటికల్ లింకులు మరోసారి ప్రపంచం ఎదుటకు వచ్చాయి.
Also Read :Opera Neon : ఒపెరా కొత్త బ్రౌజర్ ‘నియాన్’.. గూగుల్‌కు పోటీగా ‘కామెట్’
సైఫుల్లా కసూరీ ఏమన్నాడంటే..
మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో లాహోర్‌లో జరిగిన అణు పరీక్షల వార్షికోత్సవ ర్యాలీ(Pakistan Nuclear Test)లో లష్కరే తైబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరీ, లష్కరే తైబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ పాల్గొన్నారు. పంజాబ్ అసెంబ్లీ ప్రావిన్షియల్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాత్‌తో కలిసి అతడు వేదికపై నిలబడ్డాడు. ఈ ర్యాలీలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఉగ్రవాది సైఫుల్లా కసూరీ మాట్లాడుతూ.. ‘‘నన్ను పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్‌మైండ్‌గా నిందిస్తున్నారు. దీంతో ఇప్పుడు నేను వరల్డ్ ఫేమస్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చాడు. అతడు దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించాడు. ఈ ప్రసంగంలో భారత్‌పై విషం కక్కాడు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ చేసిన దాడిలో మరణించిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరిట పంజాబ్ ప్రావిన్స్‌లోని అల్హాబాద్‌లో స్మారకం నిర్మిస్తానని కసూరీ ప్రకటించాడు. తల్హా సయీద్ కూడా భారత వ్యతిరేకత వ్యాఖ్యలు చేశాడు.
Also Read :Sindoor Sarees : సిందూరం చీరల్లో మోడీకి 15వేల మంది మహిళల స్వాగతం
పీఎంఎంఎల్ ముసుగులో ఉగ్రవాదం
తల్హా గతంలో లాహోర్ నుంచి నేషనల్ అసెంబ్లీ 122వ సీటుకు పోటీ చేసి ఓడిపోయాడు. లష్కరే తైబా రాజకీయ విభాగం పేరు పీఎంఎంఎల్. పాకిస్తాన్‌లో లష్కరే తైబాపై బ్యాన్ ఉండటంతో, పీఎంఎంఎల్ ముసుగులో హఫీజ్ సయీద్, తల్హా సయీద్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.