వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద (Swami Nithyananda) మరోసారి వార్తల్లోకెక్కారు. భారతదేశం నుంచి పరారైన ఆయన, ఇప్పుడు బొలీవియాలో భూమి కుంభకోణానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ఒక దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద, తన ‘కైలాస’ (Kailasa) సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది. బొలీవియా(Bolivian )లోని భూములను లీజుకు తీసుకునేందుకు ఆయన అనుచరులు స్థానిక తెగలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యత్నించారు. అయితే ఇది బయటకు రావడం తో వెంటనే బొలీవియా ప్రభుత్వం అప్రమత్తమై తక్షణమే చర్యలు చేపట్టింది.
Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు వలన ముస్లిం మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
బొలీవియా భూములను తక్కువ ఖర్చుతో సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో నిత్యానంద అనుచరులు పలు తప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. కార్చిచ్చు సమయంలో స్థానిక తెగలకు సహాయంగా వ్యవహరించి, వారి నమ్మకాన్ని గెలుచుకున్న తరువాత, భూములను లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించారు. కైలాస ప్రతినిధులు బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌తో ఫోటోలు దిగడం, తద్వారా ప్రభుత్వ సంబంధాలను చూపిస్తూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. అయితే నిత్యానంద ప్రతినిధుల అసలు ఉద్దేశ్యం బయటపడటంతో బొలీవియా ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెంటనే 20 మంది అనుచరులను అరెస్టు చేసి, వారిని స్వదేశాలకు పంపించింది.
Waqf Bill : రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం
నిత్యానంద దేశం విడిచిపోయిన తర్వాత ‘కైలాస’ అనే ప్రాంతాన్ని స్థాపించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ కైలాస ఎక్కడ ఉందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. గతంలో నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో ఒక చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని నామకరణం చేసినట్లు ప్రకటించారు. అయితే బొలీవియాలో జరిగిన ఈ తాజా ఘటనతో నిత్యానంద భూకబ్జా లీలలు మరింత వివాదస్పదం అయ్యాయి. ఇప్పటివరకు మతగురువుగా ప్రసిద్ధి చెందిన నిత్యానంద, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పద వ్యక్తిగా మారారు.