Ambani In Pakistan : భారతదేశ అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ గురించి పాకిస్తానీలకు కూడా ఆసక్తి పెరిగింది. ఆయన గురించి పాకిస్తానీలు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారట. 2024 సంవత్సరంలో పాకిస్తాన్ ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో మన ముకేశ్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో క్రికెటర్ షోయబ్ మాలిక్ 6వ స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీకి సంబంధించిన ఏయే అంశాల గురించి పాకిస్తానీలు సెర్చ్ చేశారు ? వాళ్లకు ఎందుకంత ఇంట్రెస్ట్ కలిగింది ఈ కథనంలో చూద్దాం..
Also Read :Earthquake: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భూకంపం
పాకిస్తానీలు అత్యధికంగా ఏ పదాలతో సెర్చ్ చేశారు ?
- 2024లో పాకిస్తానీలు గూగుల్ సెర్చ్‌లో.. “ముకేశ్ అంబానీ వర్త్”, “ముకేశ్ అంబానీ నికర సంపద విలువ”(Ambani In Pakistan) అనే అంశాలను అత్యధికంగా సెర్చ్ చేశారు.
- “ముకేశ్ అంబానీ కుమారుడు”, “ముకేశ్ అంబానీ కుమారుడి పెళ్లి”, “ముకేశ్ అంబానీ ఇల్లు”, “రూపాయిల్లో అంబానీ నికర ఆస్తి విలువ” అనే అంశాలను పాకిస్తానీలు గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేశారు.
- ఈ ఏడాది ముకేశ్ అంబానీ గురించి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన పాకిస్తానీలను ప్రాంతాలవారీగా గూగుల్ గుర్తించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్, పంజాబ్, రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతాల వారు ముకేశ్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.
- ఈ ఏడాది పాకిస్తానీలు ఇంటర్నెట్‌లో భారత్‌కు సంబంధించి అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాలో.. భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియళ్లు ఉన్నాయి. ఈ లిస్టులో హీరామండి నంబర్ 1 ప్లేసులో ఉంది. హీరామండి అనేది సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న టీవీ సీరియల్. 12వ తరగతి ఫెయిల్, యానిమల్, స్త్రీ 2, మీర్జాపూర్, బిగ్ బాస్‌ల గురించి పాకిస్తానీలు గూగుల్‌లో బాగా సెర్చ్ చేశారు. టీమిండియా ఆడిన తాజా క్రికెట్ మ్యాచ్‌ల సమాచారం గురించి సైతం ఎక్కువగా సెర్చ్ చేశారు.
- అంతకుముందు 2023 సంవత్సరంలో పాకిస్తానీలు అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన భారతీయుల జాబితాలో భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్, బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నిలిచారు.