Jihadi Attack : ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. బుర్కినాఫాసో ఉత్తర ప్రాంతంలో దాదాపు 130 మందికిపైగా ప్రజలను దారుణంగా హత్య చేశారు.చనిపోయిన వారిలో ఎక్కువ మంది సైనికులు, కార్మికులే ఉన్నారు. డజిబో పట్టణంలోని సైనిక స్థావరం సహా మొత్తం 8 సైనిక స్థావరాలపై జిహాదీ ఉగ్రవాదులు ఏకకాలంలో చేసిన దాడుల్లోనే ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు ఈ మారణహోమం చోటుచేసుకోగా.. అత్యంత ఆలస్యంగా ఇవాళ విషయాలు ప్రపంచానికి తెలిశాయి. అల్‌ఖైదాతో లింకులున్న జమాత్ నస్రల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్ (JNIM) అనే ఉగ్రవాద సంస్థే ఈ పాశవిక దాడి చేసినట్లు గుర్తించారు. ఆ దాడిని తామే చేశామని JNIM ఓ ప్రకటన విడుదల చేసింది. బుర్కినా ఫాసోలోని సాహేల్ అనే ప్రాంతంపై జమాత్ నస్రల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్‌కు బలమైన పట్టు ఉంది. ఏకకాలంలో 8 చోట్ల ఉగ్రదాడిని చేయడం ద్వారా బుర్కినా ఫాసో వాయుసేనను JNIM ఉగ్రవాదులు గందరగోళానికి గురి చేశారని తెలిసింది. దీనివల్ల ముందుగా ఎక్కడ దాడి చేయాలనే దానిపై బుర్కినా ఫాసో(Jihadi Attack) వాయుసేన క్లారిటీకి రాలేకపోయింది. ఉగ్రవాద వ్యతిరేక సైనిక యూనిట్లను JNIM ఉగ్రవాదులు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారని తెలిసింది.
Also Read :Tirumala Hills: తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థ.. ఎందుకు ?
రష్యా పర్యటనకు వెళ్లి రాగానే..
సాహేల్ ప్రాంతంలో ఉన్న జమాత్ నస్రల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు బుర్కినా ఫాసో ప్రభుత్వం రష్యాతో చేతులు కలిపింది. గత శుక్రవారం రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో బుర్కినా ఫాసో సైనిక ప్రభుత్వ అధినేత ఇబ్రహీం ట్రోరే భేటీ అయ్యారు. ఆయన రష్యా నుంచి తిరిగి రాగానే.. జమాత్ నస్రల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్ భీకర ఉగ్రదాడికి పాల్పడి 130 మంది ప్రాణాలు తీశారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సైనికులే.
Also Read :Pawan Kalyan : ‘ఎస్-400’ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్
ఖనిజ నిల్వల కోసం.. అగ్రరాజ్యాల పరోక్ష యుద్ధం
బుర్కినా ఫాసో బంగారం, వజ్రాల లాంటి విలువైన ఖనిజ వనరులకు నిలయం. అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాదులకు పరోక్షంగా ఫ్రాన్స్ నుంచి ఆయుధాలు, నిధులు సప్లై అవుతున్నాయి.ఈనేపథ్యంలో రష్యా మద్దతును కూడగట్టేందుకు గత శుక్రవారం మాస్కోకు బుర్కినా ఫాసో సైనిక ప్రభుత్వ అధినేత ఇబ్రహీం ట్రోరే వెళ్లారు. ఆయుధాలు, నిధులు ఇస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. తద్వారా రాబోయే రోజుల్లో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ఊపందుకోనున్నాయి. తమ దేశంలోని నియో ప్రాంతంలో ఉన్న బంగారు గనిని 8 ఏళ్ల లీజు కోసం రష్యా కంపెనీ నోర్డ్ గోల్డ్‌కు కేటాయిస్తున్నట్లు ఇబ్రహీం ట్రోరే ప్రకటించారు. ఈ గోల్డ్ మైన్‌లో 85 శాతం వాటా రష్యా కంపెనీకి, 15 శాతం వాటా బుర్కినా ఫాసో ప్రభుత్వానికి ఉంటుంది.