Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయమై మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా ప్రకటించింది. రాజకీయ నేతల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అనుమతించడం తమ బాధ్యత అని, అందుకే ట్రంప్‌పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆలోచనలను, మాటలను అమెరికా ప్రజలు వినాలని తాము కోరుకుంటున్నామని మెటా తెలిపింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థులంతా నిబంధనలకు లోబడి ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను వినియోగించుకోవాలని కోరింది. హింసను ప్రేరేపించేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదని హితవు పలికింది.
We’re now on WhatsApp. Click to Join
2021లో అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడికి దిగారు. ఆ ఘటన జరిగిన సమయంలోనే ట్రంప్‌కు(Trump) చెందిన ట్విటర్, ఫేస్‌బుక్(facebook), యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై బ్యాన్ ప్రకటించారు. వాస్తవానికి 2023 సంవత్సరంలోనే ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్లపై బ్యాన్‌ను మెటా ఎత్తివేసింది. ఇప్పుడు ఆయన అకౌంట్లపై ఉన్న మిగతా ఆంక్షలను కూడా ఇప్పుడు మెటా ఉపసంహరించుకుంది.దీంతో ఫేస్‌బుక్, ఇన్ స్టా అకౌంట్లను ట్రంప్ పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వినియోగించుకునేందుకు లైన్ క్లియర్ అయింది. గతేడాది ట్రంప్ ట్విటర్ ఖాతాపై పరిమితులను ఎత్తివేసినా.. ఆయన నిబంధనలను పాలో కాలేదు. తాను సొంతంగా ‘ట్రూత్ సోషల్’ పేరిట సోషల్ మీడియా వేదికను క్రియేట్ చేసుకున్నారు. దాన్ని వేదికగా చేసుకొని ట్రంప్ ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు. అయితే ఫేస్‌బుక్‌లో ట్రంప్‌కు 3.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Also Read : Ganta Srinivasa Rao : గంటా ఆస్తులు వేలం..?
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి అపర కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ విరాళం ఇచ్చారు. ఎంత మొత్తం ఇచ్చారు అనేది వెల్లడి కాలేదు. ట్రంప్‌నకు గానీ, బైడెన్‌కు గానీ తన వైపు నుంచి ఆర్థిక సహకారం ఉండబోదని గతంలో మస్క్ చెప్పారు. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు ట్రంప్ వైపున నిలబడాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీ (PAC)కి ఎలాన్ మస్క్ విరాళాన్ని అందించినట్లు తెలుస్తోంది.