ISKCON: నిన్న ఆదివారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదం నుంచి ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు. కాగా డోనాల్డ్ ట్రంప్ ని ఆ జగన్నాథుడే రక్షించాడని ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక ఉద్యమం ఇస్కాన్ ప్రకటించింది. జగన్నాథుడి వల్లే ట్రంప్ ఈరోజు జీవించి ఉన్నారని కోల్‌కతాలోని ఇస్కాన్ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ సోమవారం పేర్కొన్నారు.
పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో అతని కుడి చెవి పైభాగంలో ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. ట్రంప్ చెవి నుంచి రక్తం వచ్చేలా ఈ బుల్లెట్ చాలా దగ్గరగా వెళ్లింది. దీంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఒక మాజీ అమెరికా అధ్యక్షుడిపై ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోవడంపై భద్రత వైఫల్యాలు తేటతెల్లం అయ్యాయి. అయితే ఈ ప్రమాదంపై స్పందించారు. ఇస్కాన్ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ 48 ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో జరిగిన తొలి రథయాత్ర గురించి ఇస్కాన్ ప్రతినిధి రాధారామన్ దాస్ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. డొనాల్డ్ ట్రంప్ పెద్ద పాత్ర పోషించిన రథయాత్ర ఇదే. ఈ రథయాత్ర కోసం ట్రంప్ భక్తులకు సహాయం చేశారు. అందుకే ఆ జగన్నాధుడు ట్రంప్ ని కాపాడాడు అని ఆయన తెలిపారు.
రాధారామన్ దాస్ జూలై 1976 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. 1976లో, డొనాల్డ్ ట్రంప్ రథయాత్ర నిర్మాణానికి తన రైలు యార్డ్‌ను ఉచితంగా అందించడం ద్వారా రథయాత్రలో ఇస్కాన్ భక్తులకు సహాయం చేశారు. నేడు ప్రపంచం 9 రోజుల జగన్నాథ రథయాత్ర పండుగను జరుపుకుంటున్నప్పుడు, అతనిపై జరిగిన ఈ భయంకరమైన దాడి మరియు అతను తృటిలో తప్పించుకోవడం జగన్నాథుని జోక్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన భావించారు.
ఒడిశాలోని పూరి నగరంలో ప్రతి సంవత్సరం జగన్నాధుడి రథయాత్ర నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ప్రధానంగా మూడు దేవతలను పూజిస్తారు, ఇందులో జగన్నాథుడు, అతని అన్న బలభద్రుడు మరియు అతని సోదరి సుభద్ర ఉన్నారు. ఈ సంవత్సరం ఈ రథయాత్ర జూలై 7 నుండి ప్రారంభమై జూలై 8 వరకు కొనసాగింది.
Also Read: MLA Vivekananda : కేసీఆర్ తోనే నేను – ఎమ్మెల్యే వివేకానంద క్లారిటీ