Kamala Harris Husband : ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా భారత సంతతి వనిత కమలా హ్యారిస్ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కమల ముందంజలో ఉన్నారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలో కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎంహాఫ్‌పై ప్రముఖ బ్రిటీష్ వార్తా పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.
Also Read :Iran Hit List : ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ హిట్ లిస్ట్.. ఏ1గా బెంజమిన్ నెతన్యాహూ
ప్రస్తుతం డగ్లస్ ఎంహాఫ్ వయసు 59 ఏళ్లు. ఆయన మొదటి భార్య పేరు కెర్‌స్టిన్ ఎంహాఫ్. ప్రస్తుతం కెర్‌స్టిన్ వయసు 57 ఏళ్లు. 1992లో వీరిద్దరి పెళ్లి జరిగింది. మొదటి భార్యతో డగ్లస్ ఎంహాఫ్‌కు ఇద్దరు పిల్లలు కలిగారు. వారి పేర్లు కోల్, ఎల్లా. పెళ్లి జరిగిన 16 ఏళ్ల తర్వాత (2008 సంవత్సరంలో) డగ్లస్, కెర్‌స్టిన్ విడాకులు తీసుకున్నారు. అయినా తన పేరుతో పాటు ఎంహాఫ్ అనే ఇంటి పేరును కంటిన్యూ చేసేలా కోర్టు నుంచి కెర్‌స్టిన్ చట్టపరమైన అనుమతులను పొందారు. 2014 సంవత్సరంలో కమలా హ్యారిస్‌తో డగ్లస్ ఎంహాఫ్‌కు పెళ్లి జరిగింది. అయితే మొదటి భార్య ఉన్న టైంలోనే ఒక యువతితో తనకు వివాహేతర సంబంధం ఉండేదని స్వయంగా డగ్లస్ ఎంహాఫ్ చెప్పారంటూ సదరు బ్రిటన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. తన మొదటి భార్య పిల్లలు చదువుకునే స్కూలులో టీచర్‌గా(Kamala Harris Husband) పనిచేసే ఆ యువతితో తాను సంబంధం నెరిపానని డగ్లస్ చెప్పినట్లు కథనంలో ప్రస్తావించారు.
Also Read :Google – Adani : అదానీ గ్రూపుతో గూగుల్ జట్టు.. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం
ఆమె గర్భం కూడా దాల్చిందని, అయితే వెంటనే గర్భస్రావం చేయించుకుందని బ్రిటన్ పత్రిక న్యూస్ స్టోరీలో పేర్కొన్నారు. ‘‘నాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి ఓసారి దారుణంగా ప్రవర్తించింది. 2012 మే నెలలో ఆ అమ్మాయితో కలిసి నేను ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లాను. అక్కడ కారు పార్కింగ్ పనులు చేసే ఓ యువకుడితో ఆమె సరసాలాడటం మొదలుపెట్టింది. దీంతో నాకు కోపం వచ్చి ఆమెను చెంపదెబ్బ కొట్టాను’’ అని స్వయంగా డగ్లస్ ఎంహాఫ్ చెప్పారని కథనంలో పేర్కొన్నారు. కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో ఆమె భర్తపై వెలువడిన ఈ కథనం అమెరికాలో రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.