214 Hostages Killed: 214 మంది బందీలను చంపాం.. ‘రైలు హైజాక్‌’పై బీఎల్ఏ ప్రకటన

జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగిలలోని బందీలను కాపాడేందుకు(214 Hostages Killed) పాక్ ఎస్‌ఎస్‌జీ కమాండోలు రాగానే, మేం బందీలను చంపాం.

Published By: HashtagU Telugu Desk
Jaffar Express Hijack 214 Hostages Killed Baloch Rebels Balochistan Liberation Army

214 Hostages Killed:  ఇటీవలే జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను హైజాక్ చేసి పాకిస్తాన్‌లో కలకలం రేపిన బెలూచిస్తాన్ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్ఏ) సంచలన ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ఆర్మీ దూకుడుకు ప్రతిచర్యగా తమ చెరలో ఉన్న 214 మంది బందీలను చంపేశామని వెల్లడించింది. రైలు హైజాక్ ఆపరేషన్ ముగిసిందని పేర్కొంటూ పాక్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను బీఎల్ఏ ఖండించింది.

Also Read :Mamnoor Airport : నిజాం వర్సెస్ భారత సైన్యం.. మామునూరు ఎయిర్‌పోర్ట్ చారిత్రక విశేషాలు

మా వాళ్లను జైళ్ల నుంచి రిలీజ్ చేయనందుకే..

‘‘జైళ్లలో మగ్గుతున్న బీఎల్ఏ ఉద్యమకారులను విడుదల చేయమని మేం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరాం.  48 గంటల్లోగా మా వాళ్లను విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హైజాక్ క్రమంలో వార్నింగ్ ఇచ్చాం. మా హెచ్చరికను పాక్ సర్కారు విస్మరించింది. అందుకే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో మా అదుపులో ఉన్న 214 మందిని చంపాం’’ అని బీఎల్ఏ తెలిపింది.

Also Read :Copy Vs Inspire : పాటల కాపీయింగ్ వర్సెస్ ఇన్‌స్పైర్‌ కావడం.. దేవిశ్రీ ప్రసాద్‌ సంచలన కామెంట్స్

వాళ్లు రాగానే.. బందీలను చంపాం

‘‘మేం (బీఎల్‌ఏ) అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తాం. పాక్ సైన్యం మాతో చర్చలు జరపాల్సింది. అలా కాకుండా మాతో పోరాటానికి అది ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే బందీలను చంపాం. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగిలలోని బందీలను కాపాడేందుకు(214 Hostages Killed) పాక్ ఎస్‌ఎస్‌జీ కమాండోలు రాగానే, మేం బందీలను చంపాం. కొందరు బందీలను ఉరితీశాం. ఎస్ఎస్‌జీ కమాండోలను కూడా చాలామందిని చంపాం. మా వాళ్లు చివరి బుల్లెట్‌ వరకు పోరాడారు’’ అని బీఎల్ఏ వివరించింది. ఈ ఆపరేషన్‌లో విజయం తమదేనని వెల్లడించింది.  జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటనలో కేవలం 26 మంది బందీలు చనిపోయారని పాక్ ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. తాజాగా బీఎల్ఏ ప్రకటనతో అంతటా అయోమయం ఆవరించింది. అసలు ఎంతమంది చనిపోయారు ? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బీఎల్ఏ ప్రకటనపై పాక్ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

  Last Updated: 15 Mar 2025, 12:54 PM IST