Site icon HashtagU Telugu

Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం విషమం.. వారసుడిగా ముజ్తబా ఖమేనీ ?

Irans Supreme Leader Ayatollah Ali Khamenei Mojtaba Khamenei

Khamenei : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య  యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ప్రస్తుతం ఆయనకు వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. 85 ఏళ్ల వయసు కలిగిన ఆయతుల్లా అలీ ఖమేనీ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఒకవేళ ఆయతుల్లా అలీ ఖమేనీకి ఏదైనా జరిగితే.. తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్‌‌గా  ఖమేనీ రెండో కుమారుడు 55 ఏళ్ల ముజ్తబా ఖమేనీని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Also Read :Mann ki Baat : ‘డిజిటల్‌ అరెస్ట్‌’లపై ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచనలు

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఇరాన్ సుప్రీం లీడర్ పరిధిలోనే పనిచేస్తాయి. ఇరాన్‌లో సుప్రీం లీడర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. ఇరాన్‌లో 1970వ దశకంలో షియా ఇస్లామిక్ విప్లవం వచ్చింది. నాటి నుంచి ఖమేనీ కుటుంబమే ఇరాన్‌ను పాలిస్తోంది. 1989 సంవత్సరంలో రూహుల్లా ఖమేనీ(Khamenei) మరణించారు. దీంతో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీ ఖమేనీ పగ్గాలు చేపట్టారు.

Also Read :Philippines Floods: ఫిలిప్పీన్స్‌లో తుఫాను.. 100 మంది మృతి, 51 మంది గల్లంతు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ జీవించి ఉన్నప్పుడు.. తదుపరి సుప్రీం లీడర్‌గా ఆయనకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని నెలల క్రితమే అకస్మాత్తుగా  హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ హెలికాప్టర్ ప్రమాదానికి వాతావరణం ప్రతికూలంగా ఉండటమే కారణమని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ పదవి తనకే దక్కాలనే ఆసక్తి ముజ్తబా ఖమేనీకి ఉందనే అంశాన్ని అంతర్జాతీయ మీడియా కథనాల్లో ప్రస్తావించారు. మొత్తం మీద ఇరాన్ అంతర్గత రాజకీయాలు పెద్ద మిస్టరీగా మిగిలిపోయాయి.

Also Read :Belly Fat: ఏంటి బెల్లీ ఫ్యాట్ క్యాన్సర్ కు దారితీస్తుందా.. ఇందులో నిజమెంత!