Site icon HashtagU Telugu

Tariffs : అమెరికా వస్తువులపై భారత్‌ టారిఫ్‌లు..!

India's tariffs on American goods..!

India's tariffs on American goods..!

Tariffs : న్యూఢిల్లీ వాణిజ్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా భారత్‌ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లకు ప్రతీకారంగా, కొన్ని ప్రత్యేక రకాల అమెరికన్‌ వస్తువులపై సుంకాలు పెంచనున్నట్లు భారత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కి అధికారికంగా తెలిపింది. ఇది ట్రంప్‌ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలపై భారత్‌ స్పందనగా చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలకు జవాబుగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, అమెరికా వస్తువులకు ఇస్తున్న కొన్ని విధుల రాయితీలను కూడా భారత్‌ తొలగించనుంది. ఈ మార్పులతో అమెరికా దిగుమతులపై భారత్‌ అధిక శాతం టారిఫ్‌లు వసూలు చేసే అవకాశం ఉంది.

Read Also: Private Schools : ప్రవైట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెట్టబోతున్న సీఎం రేవంత్

అమెరికా విధించిన టారిఫ్‌లు భారత్‌ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని అంచనా. అంచనాల ప్రకారం, 7.6 బిలియన్‌ డాలర్ల విలువగల భారత ఎగుమతులకు దీని ప్రభావం ఉంటుందనే ఊహనలున్నాయి. అమెరికా తన వాణిజ్య విధానాల్లో రక్షణాత్మక ధోరణి అవలంబిస్తున్నదని భారత్‌ ఇప్పటికే విమర్శించింది. ప్రపంచంలో క్రూడ్‌ స్టీల్‌ తయారీలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నప్పటికీ, అమెరికా విధించిన నిబంధనలు ఈ రంగంపై బరువైన భారం మోపుతున్నాయి. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో టారిఫ్‌లు అమలు చేశాడు. దీంతో, గ్లోబల్‌ వాణిజ్యంలో విపరీతమైన అసంతులనం నెలకొంది.

ఇలాంటి పరిస్థితుల్లో, భారత్‌ ఈ అంశాన్ని WTO వేదికపై బలంగా ప్రస్తావించింది. ఇది ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు ముదిరే సూచనగా భావిస్తున్నారు. ఇదే సమయంలో, భారత్‌-అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకున్న నేపథ్యంలో, ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక, అమెరికాకు వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్‌ ఇప్పటికే కొన్ని రాయితీలను ప్రతిపాదించినట్లు వాణిజ్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్యల ప్రభావం ఇద్దరు దేశాల వాణిజ్య సంబంధాలపై ఎంతవరకు పడుతుందో చూడాలి.

Read Also: ISRO : పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో