India-US Trade Deal : అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ తన సత్తా చాటుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై గతంలో చేసిన ‘టారిఫ్ ‘ వ్యాఖ్యల నుండి, నేడు సుంకాలు తగ్గించే వరకు చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌పై సుంకాల యుద్ధం ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు భావించాయి. గతంలో ఆయనే స్వయంగా భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అని సంబోధించారు. అయితే, ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ ఏమాత్రం బెదరకుండా తనదైన శైలిలో ‘సైలెంట్ చాణక్యం’ నడిపింది. ఇతర పొరుగు దేశాల పాలకల్లా అమెరికా ముందు మోకరిల్లడం కాకుండా, అంతర్జాతీయ వేదికపై తన బలాన్ని పెంచుకునే వ్యూహాన్ని అమలు చేసింది. అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరోపియన్ యూనియన్ (EU) వంటి ఇతర శక్తివంతమైన కూటములతో ఆర్థిక బంధాన్ని బలపరుచుకోవడం ద్వారా ట్రంప్‌కు పరోక్షంగా గట్టి సంకేతాలు పంపింది.
భారత్ తన మార్కెట్ శక్తిని అస్త్రంగా వాడుకుంది. యూరోపియన్ యూనియన్‌తో ‘మదర్ ఆఫ్ డీల్స్’ పేరుతో అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి సిద్ధమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటు కెనడా వంటి దేశాలు కూడా భారత్‌తో కలిసి నడవడానికి ఆసక్తి చూపడం అమెరికాను ఆలోచనలో పడేసింది. భారత మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుండటం, అమెరికా కంపెనీలకు భారత్ ఒక అనివార్యమైన మార్కెట్ కావడంతో ట్రంప్ స్వరం మారక తప్పలేదు. ఒకప్పుడు 50 శాతం టారిఫ్స్ విధిస్తామని బెదిరించిన అమెరికా, ఇప్పుడు వాటిని 18 శాతానికి తగ్గించడం మోదీ దౌత్య విజయానికి నిదర్శనం.
US Tariffs
ఈ పరిణామం వల్ల భారతీయ ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, మరియు వ్యవసాయ రంగాలకు భారీ ప్రయోజనం కలగనుంది. ప్రధాని మోదీ అనుసరించిన ‘ఈక్వల్ పార్టనర్’ (సమాన భాగస్వామి) విధానం వల్ల అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా భారత్‌ను గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెదిరింపులకు లొంగకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయడం వల్లే ‘ట్రంప్ రాజా’ ఫ్రెండ్ అంటూ సుంకాలు తగ్గించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు, ప్రపంచ చిత్రపటంలో మారుతున్న భారత ప్రాభవానికి నిదర్శనం.
