Site icon HashtagU Telugu

India – Russia : భారత్ ఎందుకు పవర్ ఫుల్ దేశమో చెప్పిన రష్యా మంత్రి

PM Modi To Russia

India – Russia : భారత్ ఎంత శక్తివంతమైన దేశమో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్  వివరంగా చెప్పారు. భారతదేశం తమ జాతీయ ప్రయోజనాల కోసం బయట శక్తుల ప్రభావం లేకుండా సొంతంగా తన భాగస్వాములను ఎంపిక చేసుకోగలదని ఆయన తెలిపారు. సెర్గీ లావ్రోవ్ ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్నారు.  జులై నెలలో జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఈసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి  రష్యా(India – Russia) అధ్యక్షత వహించనుంది.

We’re now on WhatsApp. Click to Join

న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడుతూ సెర్గీ లావ్రోవ్  కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోడీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘‘రష్యా నుంచి చమురును కొంటున్నందుకు భారత్‌పై అమెరికా, పలు ఐరోపా దేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు ?’’ అని  లావ్రోవ్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘రష్యాతో ఇంధన సహకారం కారణంగా భారత్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని మాకు తెలుసు. అలా భారత్‌పై ఒత్తిడి చేయడం పూర్తిగా అన్యాయం. అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. భారత్ సొంత ప్రయోజనాల కోసం తన భాగస్వామిని ఎంచుకునే శక్తిని కలిగి ఉంది’’ అని ఆయన చెప్పారు.  చైనా, భారత్ వంటి శక్తుల పట్ల పశ్చిమ దేశాలు విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. ఈ రెండు గొప్ప ఆసియా శక్తుల ఎదుగుదలను వాళ్లు ఓర్వలేకపోతున్నారని లావ్రోవ్ చెప్పారు.

ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడంపై ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత రక్తపాతానికి పాల్పడుతున్న పుతిన్‌ను  కౌగిలించుకోవడం తనకు  చాలా బాధ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత్ కూడా ఇటీవల తమ అసంతృప్తిని తెలియజేసింది.

Also Read :Shani Dev: శనివారం రోజు పొరపాటున కూడా ఆ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో?