Site icon HashtagU Telugu

Iran New President : ఇరాన్ అధ్యక్షుడు వర్సెస్ ఐఆర్‌జీసీ.. ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో తలోదారి

Iran New President Vs Revolutionary Guards

Iran New President : ఇటీవలే ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ వాదిస్తోంది. అయితే ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు మాత్రం ఇరాన్ సాహసించడం లేదు. దీనికి గల ప్రధాన కారణం ఏమిటనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడి చేయాల్సిందే అని ఐఆర్‌జీసీ వాదిస్తుండగా.. కొత్త దేశాధ్యక్షుడు పెజెష్కియాన్(Iran New President) మాత్రం అంత దూకుడు సరికాదని పేర్కొంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయడం కంటే ఆ దేశ గూఢచర్య సంస్థ మోసాద్ స్థావరాలున్న అజర్ బైజాన్, ఇరాకీ కుర్దిస్తాన్ ప్రాంతాలపై దాడులు చేయడం మంచిదని పెజెష్కియాన్  సూచిస్తున్నారు. తద్వారా ఇరాన్ చుట్టూ మోసాద్ ఆనవాళ్లు లేకుండా చేయొచ్చని ఆయన అంటున్నారు. ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగడం వల్ల ఇరాన్ కష్టాల్లో పడొచ్చని అధ్యక్షుడు పెజెష్కియాన్  అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read :Gaza School : గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 100 మంది మృతి

ఐఆర్‌జీసీ మాత్రం దేశ అధ్యక్షుడి వాదనలతో విభేదిస్తోందని పేర్కొంటూ ‘ది టెలిగ్రాఫ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ‘‘ అధ్యక్షుడి వైఖరి సరికాదు. మరీ అంతగా సంయమనం పాటించడం మంచిది కాదు. హిజ్బుల్లా, ఇతర మిత్రపక్ష మిలిటెంట్ సంస్థలకు సాయం కొనసాగాలి’’ అని ఐఆర్‌జీసీ తేల్చిచెబుతోందని పేర్కొంది. IRGCకి చెందిన ప్రఖ్యాత ఖుద్స్ ఫోర్స్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఇస్మాయిల్ ఖానీ కూడా వెంటనే ఇజ్రాయెల్‌పై దాడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐఆర్‌జీసీ అనేది నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. అందుకే  ఐఆర్‌జీసీతో విభేదించడం అనేది అధ్యక్షుడు పెజెష్కియాన్ ‌పాలిట ప్రతికూలంగా పరిణమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read :Manish Sisodia : ‘‘స్వాతంత్య్రం వచ్చాక తొలి టీ’’.. భార్యతో కలిసి సిసోడియా తొలి పోస్ట్