Bus Accident: ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు 35 మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 55 మంది చనిపోయారు. సెంట్రల్ అమెరికా దేశం గ్వాటెమాలాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని గ్వాటెమాలా సిటీ శివార్లలో ఉన్న ఒక వంతెనపై నుంచి బస్సు జారిపోయి, మురుగు నీటితో నిండిన లోయలో పడింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, బస్సులో నుంచి 53 మృతదేహాలను వెలికితీశారు. బస్సులోని మరో ఇద్దరు ప్రయాణికులకు శాన్ జువాన్ డి డియోస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Also Read :Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ
గుండెలు అవిసేలా రోదనలు
ప్రోగ్రెసో గ్రామం నుంచి గ్వాటెమాలా సిటీ వైపుగా బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం(Bus Accident) జరిగిందని గుర్తించారు. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ప్రయాణంలో ఉండగా తమవారు చనిపోయారని తలుచుకొని, వాళ్లంతా గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఈ ప్రమాదంపై గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఇవాళ జాతీయ సంతాప దినాన్ని పాటించాలని దేశ ప్రజలను కోరారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ప్రకటించారు.
కార్ రేసు కోసం హీరో ట్రైనింగ్
పోర్చుగల్ కార్ రేస్ పోటీల కోసం హీరో అజిత్ కారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆయన మరోసారి ప్రమాదానికి గురయ్యారు. దుబాయ్‌లో జరిగే 24హెచ్ కార్ రేస్ పోటీల కోసం శిక్షణ పొందుతుండగా ఇటీవలే ఒకసారి అజిత్ కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆ పోటీల నుంచి ఆయన తప్పుకున్నారు. అయినా అజిత్ కుమార్ రేసింగ్ టీం ఆ పోటీల్లో మూడో స్థానంలో నిలిచింది. దీంతో అజిత్ కుమార్‌కు ‘లిబర్టీ ఆఫ్ ది గేమ్’ అనే అవార్డును ప్రదానం చేశారు.