Site icon HashtagU Telugu

Chinas New Weapon: చైనా కొత్త బాంబు.. దడ పుట్టించే నిజాలు

Chinas New Weapon Hydrogen Bomb Modern Warfare

Chinas New Weapon: తొలిసారిగా శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును చైనా పరీక్షించింది. ఈ ప్రయోగ పరీక్ష సక్సెస్ అయింది.  అయితే ఈ సరికొత్త హైడ్రోజన్ బాంబు చాలా భిన్నమైందని చైనా వెల్లడించింది.  సర్వసాధారణ హైడ్రోజన్ బాంబుల్లా.. ఇది అణు సంలీనం (nuclear fusion)పై ఆధారపడదని చైనా స్పష్టం చేసింది. మెగ్నీషియం హైడ్రైడ్ అనే పదార్థాన్ని ఉపయోగించే రసాయనిక ప్రక్రియ ద్వారా ఈ బాంబు పేలుతుందని తెలిపింది.  దీని ఫలితంగా శక్తివంతమైన అగ్నిగోళం ఏర్పడుతుందని చెప్పింది.  అణు పదార్థాలు లేకున్నా.. నిరంతరాయంగా ఈ బాంబు అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయగలదు.

చైనా కొత్త బాంబు గురించి..