Who is Brigitte Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌ను ఆయన భార్య బ్రిగిట్టే మేక్రాన్ కొట్టారు. ఇమాన్యుయేల్ మేక్రాన్‌ను బ్రిగిట్టే చెంప ఛెల్లుమనిపించడం కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై మీడియాకు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఇచ్చిన క్లారిటీ మరోలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భార్య బ్రిగిట్టే తనను కొట్టలేదని, తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవ పడుతుంటామని ఇమాన్యుయేల్(Who is Brigitte Macron) తేల్చి చెప్పారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న సీరియస్‌నెస్‌ను చూస్తే మాత్రం మేక్రాన్ అబద్దం చెబుతున్నట్లు తేటతెల్లం అవుతోంది. మొత్తం మీద ఇమాన్యుయేల్ మేక్రాన్ దంపతుల మధ్య ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read :Asaduddin Owaisi : చైనా ఆర్మీ డ్రిల్ ఫొటోతో నాటకాలు.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లపై ఒవైసీ ఫైర్
ఇమాన్యుయేల్ మేక్రాన్ భార్య గురించి..
- ఇమాన్యుయేల్ మేక్రాన్ భార్య అసలు పేరు బ్రిగిట్టే ట్రోగ్నిక్స్.
- ఆమె గతంలో ఒక సాధారణ టీచర్.
- వాస్తవానికి ఇమాన్యుయేల్ మేక్రాన్ విద్యార్థిగా ఉన్న సమయానికే బ్రిగిట్టే ట్రోగ్నిక్స్ టీచర్‌గా పనిచేసేవారు.
- ఆ సమయానికి ఇమాన్యుయేల్ మేక్రాన్ వయసు 15 ఏళ్లు. బ్రిగిట్టే ట్రోగ్నిక్స్ వయసు 39 ఏళ్లు.
- ఇప్పుడు బ్రిగిట్టే ట్రోగ్నిక్స్ వయసు 72 ఏళ్లు. ఇమాన్యుయేల్ మేక్రాన్ వయసు 47 సంవత్సరాలు.
- ఫ్రాన్స్‌లోని ట్రుచ్ టెర్షీమ్ అనే నగర పాలక మండలి ఎన్నికల్లో 1989లో బ్రిగిట్టే పోటీ చేశారు. అయితే ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచే ఇమాన్యుయేల్‌కు బ్రిగిట్టే చేరువ అయ్యారని చెబుతుంటారు.
- ఇమాన్యుయేల్ మేక్రాన్ తన టీచర్ బ్రిగిట్టేను పెళ్లి చేసుకోవడానికి 2006 సంవత్సరంలో రెడీ అయ్యాడు. ఆమెకు ఈవిషయాన్ని ప్రపోజ్ చేశాడు. దానికి బ్రిగిట్టే ఓకే చెప్పింది.
- 2006 జనవరిలో తన భర్త ఆజైర్‌కు బ్రిగిట్టే విడాకులు ఇచ్చారు.
- 2007 అక్టోబరు 20న తన శిష్యుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌ను బ్రిగిట్టే ట్రోగ్నిక్స్ పెళ్లి చేసుకున్నారు.