Site icon HashtagU Telugu

Shocking Incident : పుతిన్‌పై హత్యాయత్నం ? కారులో పేలుడు.. జెలెన్‌ స్కీ జోస్యం నిజమేనా ?

Assassination Attempt On Putin Limousine Explosion Russian President Car Moscow

Shocking Incident : రష్యా రాజధాని మాస్కో నడిబొడ్డున షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.  ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ అధికారికంగా వినియోగించే లిమోజిన్ కారులో భారీ పేలుడు సంభవించింది.  దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన మాస్కోలోని లుబియాంకా ఏరియాలో ఉన్న  రష్యా గూఢచార సంస్థ ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం సమీపంలో చోటుచేసుకోవడం గమనార్హం. కారులో పేలుడు సంభవించగానే ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. ఆ మంటలు క్షణాల్లోనే వాహనం లోపలికి వ్యాపించాయి. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతపై అనుమానాలు రేకెత్తాయి.  ఈ కారులో పేలుడు ఎలా సంభవించింది ? లోపల ఎవరైనా పేలుడు పదార్థాలు అమర్చారా ? అనే ప్రశ్నలు ఉదయించాయి.

Also Read :Mann Ki Baat : ప్రధాని ‘మన్​ కీ బాత్’​లో.. ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ.. దాని విశేషాలివీ

రెస్టారెంట్ సిబ్బంది సాహసం

పుతిన్ కారులో మంటలు చెలరేగగానే.. సమీపంలోని ఒక రెస్టారెంట్(Shocking Incident) సిబ్బంది అలర్ట్ అయ్యారు. వారు వేగంగా పరుగెత్తుతూ వచ్చి మంటలను ఆర్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అగ్నిమాపక వాహనం రావడానికి కొంత సమయం పట్టింది. ఒకవేళ రెస్టారెంట్ సిబ్బంది సకాలంలో వచ్చి కారుకు అంటుకున్న మంటలను ఆర్పకుంటే, అవి మరింత నష్టాన్ని కలిగించి ఉండేవి. మొత్తం మీద ఈ ఘటనలో పుతిన్ వాడే లిమోజిన్ కారు వెనుక భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పుతిన్ వినియోగించే వాహనం కావడంతో .. లిమోజిన్ కారును రష్యా ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంటుంది.

Also Read :Ugadi Horoscope 2025 : విశ్వవసు నామ సంవత్సర రాశిఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ?

పుతిన్ త్వరలోనే చనిపోతారు : జెలెన్ స్కీ

ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. ఆయన త్వరలోనే చనిపోతారని పేర్కొన్నారు. ‘‘పుతిన్ త్వరలోనే చనిపోతారు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలోనే ముగుస్తుంది’’ అని జెలెన్ స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం.