అమెరికా ఆర్థిక వ్యవస్థ (America Recession) మాంద్యం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా అమెరికా స్టాక్ మార్కెట్లు (US stock markets) భారీగా పతనమయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రవేశపెట్టిన టారిఫ్ నిబంధనల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశముందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాస్డాక్ ఇండెక్స్ ఒక్కరోజులోనే 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒకేరోజులో ఇంత పెద్ద నష్టాన్ని చూడడం ఇదే తొలిసారి.
Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో షాక్ ఇచ్చిన మంత్రి పొంగులేటి
ప్రముఖ టెక్ కంపెనీలైన టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ఈ స్టాక్ మార్కెట్ పతనం కారణంగా మొత్తం 1.9 ట్రిలియన్ డాలర్ల విలువైన సంపద ఆవిరైంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల మనోభావాలపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. స్టాక్ మార్కెట్ క్షీణతతో పాటు, వ్యాపార వృద్ధి మందగించడం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వంటి అంశాల వల్ల ఆర్థిక మాంద్యం ముప్పు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగాయని చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెరుగుదల, ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ వాణిజ్యలో అనిశ్చితి వంటి అంశాలు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పౌరులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతే, వినిమయం తగ్గి మార్కెట్లపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
Posani : నటుడు పోసానికి బెయిల్ మంజూరు
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను సమీక్షించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం, ఆర్థిక నిపుణులు కలిసి ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచే మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే గ్లోబల్ మార్కెట్లపై అమెరికా స్టాక్ మార్కెట్ పతనం తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.