Site icon HashtagU Telugu

Car Accident : జనంపైకి దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి.. 43 మందికి గాయాలు

China Car Accident Zhuhai City

Car Accident : చైనాలో ఘోరం జరిగింది. జుహై నగరంలోని ఓ స్పోర్ట్స్​ సెంటర్ వద్ద కారు అతివేగంతో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 35మంది ప్రాణాలు కోల్పోగా, 43మందికి గాయాలయ్యాయి. 62 ఏళ్ల డ్రైవర్ అతివేగంతో కారును నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని  పోలీసులు గుర్తించారు. అతడిని ఇప్పటికే అరెస్టు చేశారు.

Also Read :Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే

సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ (Car Accident) క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికార వర్గాలను ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అయితే  ఇది కుట్రపూరితంగా జరిగిన ఘటనా ? ప్రమాదమా ? అనే దానిపై పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది.  ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియోను లీ యాంగ్ అనే న్యూస్ బ్లాగర్​ షేర్​ చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఒక వ్యక్తికి సీపీఆర్​ చేస్తున్నట్లు అందులో ఉంది. డజన్ల కొద్దీ మంది రన్నింగ్ ట్రాక్​పై పడిపోయి ఉండటం ఆ వీడియోలో కనిపించింది.

Also Read :Train Owner : ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓనర్‌ అయిన రైతు.. ఎలా అంటే ?

జుహై​లో ఈరోజు ఎయిర్​ షో ప్రారంభమైంది. అందుకే సోమవారం రాత్రి జరిగిన కారు ప్రమాదం వివరాలు మీడియాలో పబ్లిష్ కాకుండా చైనా ప్రభుత్వం సెన్సార్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వివరాలు బయటికి వస్తే.. ఎయిర్ షో జరుగుతున్న వేళ జుహై ప్రాంత ఇమేజ్ దెబ్బతింటుందని, ప్రజలు భయాందోళనలకు గురవుతారని చైనా సర్కారు భావించి ఉంటుందని  అంటున్నారు.  ఇక చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ‘వీబో’లో కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన కేవలం ఒకటి, రెండు వీడియోలే ఉన్నాయి.