26 KILLED : ట్రక్కు, వ్యాన్‌ ఢీ.. 26 మంది సజీవ దహనం

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రైలర్ ను తీసుకెళ్తున్న భారీ ట్రక్కు, ప్యాసింజర్ వ్యాన్ ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో 26 మంది(26 KILLED) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 09:37 AM IST

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రైలర్ ను తీసుకెళ్తున్న భారీ ట్రక్కు, ప్యాసింజర్ వ్యాన్ ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో 26 మంది (26 KILLED) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు. ఈవిషయాన్ని మెక్సికోలోని తమౌలిపాస్ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. రాష్ట్ర రాజధాని సియుడాడ్ విక్టోరియా సమీపంలోని హైవేపై ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. ట్రాక్టర్ ట్రైలర్ లోడ్ పరిమితికి మించి ఉండటంతో ట్రక్కు పై డ్రైవర్ అదుపు కోల్పోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలిపారు. ట్రక్కు ఢీకొట్టగానే ప్యాసింజర్ వ్యాన్ లో ఉన్న 26 మంది(26 KILLED) చనిపోయారని వెల్లడించారు.

ALSO READ : Hawaii: వామ్మో.. చావు అంచుకు తీసుకెళ్లిన విమానం… రెప్పపాటులో ఎగిరి!?

మంటల్లో బుగ్గి..

అయితే పోలీసులు వెళ్లేసరికి సంఘటనా స్థలంలో ట్రక్కు అక్కడ లేదు. ట్రాక్టర్ ట్రైలర్, ప్యాసింజర్ వ్యాన్ లు మంటల్లో బుగ్గి అయి కనిపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కుతో డ్రైవర్ పరారై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలో పడి ఉన్న డెడ్ బాడీస్ లో.. ట్రక్కు డ్రైవర్ మృతదేహం కూడా ఉండొచ్చని ఇంకొందరు చెబుతున్నారు. ట్రాక్టర్ ట్రైలర్ భాగంలో ఉన్న డీజిల్ లీక్ అయి ఏర్పడిన మంటలు.. ప్యాసింజర్ వ్యాన్ కు వ్యాపించి అందులోని వారు సజీవ దహనం అయ్యారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఐడీ కార్డుల ఆధారంగా మృతులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.