Mysterious Hair Loss: అక్కడి ప్రజల జుట్టు అకస్మాత్తుగా రాలుతోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వందలాది మందిని ఈ సమస్య చుట్టుముట్టింది. ఇంతకీ ఎందుకో తెలియక జనం జుట్టు పట్టుకుంటున్నారు. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నెలకొన్న ఈ పరిస్థితిపై కథనమిది.
Also Read :Samsung Tri Fold Phone: మూడు మడతలతో శాంసంగ్ ఫోన్.. ఫీచర్లు ఇవీ
పెళ్లిళ్లు కుదరక యువత వైరాగ్యం
పిల్లల నుంచి పెద్దల వరకు.. పురుషుల నుంచి స్త్రీల వరకు ఇలా అందరి జుట్టు(Mysterious Hair Loss) రాలుతోంది. యువతీయువకులకు జుట్టు రాలుతుండటంతో పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో వారిని వైరాగ్యం ఆవరిస్తోంది. 2024 డిసెంబరులో మొదలైన ఈ సమస్య ఫిబ్రవరి నెలలో మరింత ముదిరింది. బుల్ధానా జిల్లాలో జుట్టు రాలే సమస్యతో సతమతం అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుల్ధానా జిల్లా పరిధిలోని 18 గ్రామాలకు చెందిన దాదాపు 279 మంది దీనికి బాధితులుగా మారారు. అకస్మాత్తుగా జుట్టు రాలే ఈ సమస్యను మెడికల్ భాషలో ‘అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్’ అని పిలుస్తారు.
Also Read :Surgeon Vs 299 Patients : 299 మంది రోగులపై సర్జన్ అత్యాచారం.. సంచలన కేసు
ఎందుకీ సమస్య ?
మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా గోధుమలను ఆహారంగా వినియోగిస్తుంటారు. గోధుమలతో రొట్టెలు చేసుకొని తింటుంటారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలోని రేషన్ షాపులకు నిత్యం గోధుమలు దిగుమతి అవుతుంటాయి. ఆ గోధుమలలో అధిక మోతాదులో సెలీనియం ఉండటం వల్లే జుట్టు రాలే సమస్య వచ్చిందని వైద్య నిపుణులు అంటున్నారు. సెలీనియం అనేది నేల నుంచి ఆహార పంటలలోకి చేరే సహజసిద్ధ ఖనిజం. నీరు, కొన్ని ఆహార పదార్థాలలో సెలీనియం కొద్దిపాటి మోతాదులో ఉంటుంది. మనిషి శరీరంలో జరిగే జీవక్రియలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరానికి చాలా స్వల్ప మోతాదులో సెలీనియం సరిపోతుంది. దీని మోతాదు పెరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బుల్ధానా జిల్లా పరిధిలోని రేషన్ షాపుల్లో సరఫరా చేసిన గోధుమల్లో ఎక్కువ మోతాదులో సెలీనియం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో, బాధితుల నుంచి వైద్యాధికారులు శాంపిళ్లను సేకరించారు. వారు జుట్టురాలే సమస్యతో పాటు తలనొప్పి, జ్వరం, తల దురద, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బాధితులు తిన్న గోధుమల్లో సాధారణ మోతాదు కంటే 600 రెట్లు ఎక్కువగా సెలీనియం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. రేషన్ షాపుల ద్వారా సప్లై చేసే గోధుమలలోని రసాయనాల మోతాదును ఎప్పటికప్పుడు తనిఖీ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.