Site icon HashtagU Telugu

Bihar Crime: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన మహిళా డాక్టర్

Bihar Crime

Bihar Crime

Bihar Crime: బీహార్‌లోని సరన్ జిల్లాలో సోమవారం ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే..

మధురా బ్లాక్‌లోని వార్డు నంబర్ 12 కౌన్సిలర్ అయిన బాధితుడు చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేరాడు.అయితే అందులోనే వైద్యురాలిగా పని చేస్తున్న మహిళతో ఆ వ్యక్తికి ప్రేమ వ్యవహారం సాగుతుంది. వారి మధ్య గత ఐదేళ్లుగా సంబంధం ఉందని, అయితే అతను పెళ్లికి నిరాకరించినట్లు నిందితురాలు పేర్కొంది. అయినప్పటికీ కోర్టులో రిజిస్టర్ మ్యారేజీకి అతడిని ఎలాగోలా ఒప్పించింది. అయితే పెళ్లి చేసుకునేందుకు ఆమె కోర్టును ఆశ్రయించినా బాధితుడు హాజరు కాలేదు.

దీంతో ఆగ్రహించిన సదరు వైద్యురాలు చికిత్స కోసం వచ్చిన తన ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. అనుకున్నట్టుగానే తన ప్రైవేట్ భాగాన్ని కత్తిరించింది. కౌన్సిలర్ కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో మంచంపై పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ హాజీపూర్‌కు చెందిన 25 ఏళ్ల అవివాహిత వైద్యురాలు.

Also Read: Healthy Breakfast : ఓట్స్ తో గుంత పునుగులు.. డైట్ చేసేవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్